పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ప్లూటార్కు వర్ణితచరిత్రలు


'అంతస్థి' యను నామెను వివాహమాడెను. ఈమె న్యాయాధికారి కూఁతురు.

తదనంతర మతఁడు శత్రుపక్షమువాఁడైన 'సిన్నుని' యొక్క శిబిరములోనికి వెళ్లెను. కారణములేక యతనిని శత్రువు నిందించినందున నతఁ డక్కడనుండి వెడలెను. సైనికు లందఱు నతనిని 'సిన్నుఁడు' చంపియుండు నని యెంచి వా రతనితోఁ గలహించి వానిని జంపివేసిరి.

ఈలోపున పాంపేయుఁడు స్వగ్రామమునకుఁ బోయి యక్కడ ప్రజల నందఱిని రేపి కొంత సైన్యమును సమకూర్చెను. కొంతకాలమున కతనిసైన్యము బహుళమైనందున రాజ్యాధికారు లందఱు మిగులభయపడిరి. సం|| 23 రముల వయసువాఁడై రాజ్యాధికారుల సెలవులేనిది యతఁ డీ సైన్యమును చేర్చెను. రాష్ట్రము పక్షమునఁ గొందఱు సేనాధిపతులు సైన్యములను దీసికొనివచ్చి యతనితోఁ బోరాడిరి. కాని వారి నందఱి నతఁడు సమరములోఁ బరిభవించెను. ఈ వార్తను విని రోముపట్టణములో నక్షదర్శకుఁడును (Consul) న్యాయాధికారియునైన 'సిపియుఁడు' దండుతో వెడలివచ్చెను. ఇతఁడుగూడ యుద్ధములో నోడి పరారియయ్యెను. ఇటుల మహాదండనాయకు లఖండంబుగ ఖండింపఁబడుటను విని 'సిల్లుఁడు' తన సైన్యమును గొని పోరాటమునకు వచ్చెను. ఇతఁడు పాంపేయుని యొక్క రథగజతురగపదాతులను జూచి వెఱుఁగుపడి అతని