పుట:Maha-Purushula-Jeevitacaritramulu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాంపేయుఁడు

95


తోఁ గలహించుటకు వెనుకకుఁ దీసెను. అపు డుభయసేనాధిపతులు (సిల్లుఁడు, సాంపేయుఁడు) మిత్రభావమున సమావేశమైనపుడు పాంపేయుఁడతనిని సార్వభౌముఁడని (Imperator) గౌరవించి వందనముఁ జేసెను. తనకంటె చిన్నవాఁ డైనను పాంపేయుని సిల్లుఁడుగూడ నటులనే గౌరవించి మన్ననఁ జేసెను. అతఁడు వచ్చినపుడెల్ల సిల్లుఁడు ప్రత్యుత్థానముఁ జేసి యతనిని దీసికొని వచ్చి యాసనముపైనిఁ గూర్చుండ నియమించుచుండెను.

ఇటుల గౌరవములను బొందుచున్నను బాంపేయుఁడు గర్వించలేదు. సిల్లుఁ డతనిని ఫ్రాంసుదేశమునకుఁ బోయి యక్కడ సేనాధిపత్యమును వహించవలసిన దని నియమించెను. “అక్కడి సేనాధిపతినిఁ బనిలోనుండి తొలగించుట న్యాయముకా"దని పాంపేయుఁడు చెప్పెను. అందులకు సిల్లుఁడు సంతసించక పాంపేయుని సేనాధిపత్యము వహించుమని నిరోధించెను. ఆజ్ఞోల్లంఘనముఁ జేయలేక పాంపేయుఁడు సమ్మతించి ఫ్రాంసుదేశమునకుఁ బోయి యక్కడి సేనాధిపత్యమును వహించి సిల్లునియొక్క కార్యముల నతఁడు నిర్వర్తించెను.

కొంతకాలమునకు 'సిల్లుడు' నానా దేశములలోను సర్వాధికారియని ప్రఖ్యాతి వహించెను. అందుల కతఁడు సంతసించి ప్రత్యయిత దండనాయకులను సన్నుతించి, బహూకరించెను. పాంపేయునియొక్క సుగుణములకు ముదమంది