పుట:Leakalu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యెడల వినయవిధేయతలతో మసులుకోమని, ముఖ్యంగా భర్తపట్ల భయభకులతో మెలగవలెనని బోధిస్తారు. బాలికలకు రోజూ యింటా, పాఠశాలా, డిటోగా యిదే కార్యక్రమం.

చిన్నప్పడు నా భార్య ఇలాంటి బడిలో తగిన తరిఫీదు పొందివుంటే, ఎంత బాగుండును! ఆవిడకు వందలకొద్దీ శ్లోకాలు నోటికివచ్చును, దబ్బుస వంటచేస్తుంది, వంట బాగుంటుంది. ఇస్కూలులో చదువుకోకుండానే, ఆవిడకు యీ విద్యలన్నీ పట్టుబడ్డాయి. పూజాపురస్కారాలు టే ఆవిడకు ప్రీతి ఎక్కువ. అందువల్ల నాకు డబ్బు అంతో యింతో ఖర్చవుతూనేవుంది. అంతో యింతో ఏమి, ఊరుకుంటే అంతా ఖర్చుపెడుతుంది. ఇలాంటి విధులు నిర్వర్తించడంలో ఆవిడ కావిడే సాటి. ఇంకొకరితో పోల్చడానికి వీలుపడదు. కనక ఆవిడ్డ ఈ బాలి కాపాఠశాలలో పంతులమ్మగా వేస్తే బాగా రాణిస్తుంది.

దైవభక్తి మతభక్తి ఎంత ఎముకలకు పట్టినా, మా ఆవిడకొక ముఖ్యబోధన తలకెక్కినట్లు కనిపించదు. మన చెప్పన్నశాస్త్రాలూ, భార్య, భర్త పట్ల భయభక్తులతో మెలగా లని బోధిస్తున్నాయి; అవునామరి, అయినాసరే, ఆవిడ కీ సూత్రాలు, గుణమిచ్చినట్టు దాఖలాపది ! భయభక్తులు లేక పోతేమానె; పైపెచ్చు తనభర్త వొట్టి తెలివితక్కువవాడని ఆవిడ నమ్మకం. అడుగడుక్కీ తన సలహా లేనిదే, వొక్క అడుగు ముందుకు వేయలేడని ఆవిడ ఉద్దేశం. అలా అని ఊరు కున్నా బాగుండును; తన భర్త తనతe)లో నాలుక లాగ వుండాలట; వినయవిధేయతలతో మెలగాలట ! అలాంటప్పడు భార్యలు భర్తలపట్ల భక్తి ప్రపత్తులతో సంచరించాలని, ఉపదే

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/8&oldid=151379" నుండి వెలికితీశారు