పుట:Leakalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలికా పాఠశాల

కలకత్తాలో రాజరుకుటుంబమువారి యింట సమావేశము జరుగుతున్నది రమ్మని మిత్రులు శ్రీ దుబిన్ బాబు నన్ను పిలిచారు; ఆహ్వానపత్రిక యిచ్చారు. కలకత్తాలో మహాకాళి పాఠశాలకలదు. దానికొక ఆఆఖగా, బాలికా పాఠశాలను నెలకొల్పవలెనన్న తలంపుతో, ఈసమావేశాన్ని ఏర్పాటుచేశారు. సనాతన హిందూధర్మములప్రకారం బాలికలకు విధ్యను బోదిస్తూ, పాఠశాలను కట్టు భాయిదాలతో నిర్వహిస్తారని నాకు తెలియవచ్చింది. బాలికలు బడి వున్నపుడు లేనప్పుడు ఏయే విధులను పాటించవలెనో వాటికి ఒక జాబితా చేయవచ్చును. పెద్దలు చాలా ధర్మసూత్రాలను తయారుచేసినారు.

పొద్దున్నే లేచినవెంటనే, ఆవురావురుమంటూ బాలికలు దేవతా ప్రార్ధనచేయవలెనట; శ్లోకములను పఠించి ఇష్టదేవతాప్రార్ధన ముగించి, ఇంటవున్న పెద్దలకు పేరుపేరునా, మొక్కవలెనట; ఇది మంచి న్యాయమే పిమ్మట 'ఆయా' వెంట ఇంకొక డోసు దేవతాప్రార్ధన శ్లోకపఠనం, ఇంతాదేవి పాఠశాలలో చెప్పే విధ్యలు; కుట్టుపని, అల్లికపని, వంట వండటం ఎక్సట్రలు, వీటికి మించిన విద్య ఇంకొకటివున్నది. పెద్దల

5

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/7&oldid=232060" నుండి వెలికితీశారు