పుట:Leakalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శిస్తున్నవారినిచూసి, నేనేకాదు, ఎవరుమాత్రం సంతోషించరు? ఇలాంటి స్కూలుకి వెంటనే పర్సుతీసి ఎంత వుంటే అంతా, విరాళమివ్వడం ఉచితం కాదూ? ఎంత యిచ్చినా అది దండుగ కాదు. దురదృష్టవంతులైన భర్తలు ఈ స్కూలు నీడను బతక వచ్చును!

సరే; మేం సమూవేశానికి వెళ్ళాం, చాలామంది బెంగాలీలు, నేలమీద బాసినమఠం వేసుకుని కూచున్నారు, నలుగురి మొహాలూ పరికించాను. అందులో కాస్త మెత్తటిమనిషి ఎవరా అని ఆలోచించాను. ఒకాయన కనిపించాడు. ఆయన సభ్యులందరిలోకి పెద్దవాడు. మొదటినుంచీ మంచిసభ్యుడుగా వుంటున్నాడు. వయోవృద్ధుడు. ఎందుకైనా మంచిదని, ఆయన చెంత చతికిలబడ్డాను. నాకు నాలుగువిసుర్లు విసరాలనిపించింది. ఒడుపు చూసుకున్నానుకదా, ఈ ముసలాయన ఏంచేయగలడు అని ఇంగ్లీషులో దండయాత్ర కుపక్రమించాను : “నిజవాఁడితే నిష్టూరం; మీరు సరసులు, కనక నిష్టూరవాఁడరు. మీ బెంగాలీలకు కొన్ని కొన్ని సందర్భాల్లో చొరవ జాస్తీ, అది మంచి లక్షణమే కాని... సామాజిక వ్యవహారాలలో మీ వాళ్ళు వొట్టి బార్బరస్, గాలీ వెలుతురూ సోకకుండా మీ ఆడవాళ్ళను జనానాకొట్లల్లో ఎందు కలా బంధిస్తారు ? కోళ్ళ గంపల్లో కుక్కితే, కోళ్లు సైతం ఉక్కిరిబిక్కిరవుతాయే; మరి మనుష్యులమాట చెప్పేదేమిటి, స్వేచ్ఛ లేకపోతే ఎలాగ? ముందు తరాలవాళ్లు గొప్పవాళ్ళు కావాలంటే, ఇప్పటి ఈ ఆచారాలు మారవద్దా ? మీ బెంగాలీలు కబుర్లు చెప్పమంటే చెబుతారు, కడుపునిండా కబుర్లే పంజరంలో చిలుకల్లాగ, అన్నీ చిలక పలుకులే, మా తెలుగువాళ్ళు అలా కాదు. మేం కార్య

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/9&oldid=152974" నుండి వెలికితీశారు