పుట:Leakalu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విస్తరణకు పాత్రల పెరుగుదలకు ఉపకరించవు, అయితే యీ నాటకంలో నాకు బాగా నచ్చిన వొక లక్షణంమాత్రం వుంది. మన దేశచరిత్రలో గుండెలను కదిలించే వృత్తాంతాన్నొక దాన్ని తీసుకుని దానిని నాటకంగా వెలయించేటపుడు యీ కవి సాహిత్యాత్మక దేశభక్తిపూరితకాల్పనిక వాతావరణాన్ని సృష్టించుకొని దానిని నేర్పుతో జయప్రదం చేశాడు. కాని నాటకంలోని చారిత్రకచిత్రీకరణమటుకు కేవలం అభూతకల్పన; అసంభావితవిషయూలు సారస్వతకట్టుబాట్లను లైసెన్సును అతిక్రమిస్తున్నాయి. నువ్వు 'ప్రతాపరుద్రీయం' చదివే వు0టావు; కనక దానినిగురించి ప్రస్తావించాను.

శ్రీ వీరేశలింగం, చిలకమర్తి రచించిననాటకాలను నువ్వు చదివివున్నట్లయితే, వాటిమీదనో, లేక నాకు తెలిసిన తదితర నాటకాలను గురించో కాదా నువ్వుచదివే నాటకాలను నాకొక్కొక్క ప్రతిచొప్పన పంపినట్లయితే వాటినో పరామర్శిస్తూ నీకు నాటకరచనాశిల్పం అవగతమయ్యేందుకు చిన్న చిన్న సమీకలు వ్రాసి పంపిస్తూవుంటాను.

పి. యస్: నాన్నగారెలా వున్నారు? ఆయనకు నా 'ప్రణామాలు'

ఎక్క హిల్ హౌస్ ఉదకమండలం 17 మే 1909

ప్రియమైన ముని సుబ్రహ్మణ్యం,

నీ ఉత్తరం అందింది. సంతోషం. ఇంగ్లీషు భాషపై నీకు సిద్ధించిన అధికారానికి, నీ విమర్శనశక్తికి నాకు ఆశ్చర్యం వేసింది.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/78&oldid=153027" నుండి వెలికితీశారు