పుట:Leakalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. అంపితేఁ బోయి వచ్చెద"ననుటయుఁ గల
   భాషిణి "మహాత్మ నిన్ను నాపాలిభాగ్య
   దేవతగ నమ్మియుంటి నాజీవితంబు
   నేమిగాఁ జేసి పోయెద వెఱుఁగ జెపుమ."

అనుటయు “నేనిప్పుడు నీకై చేయవలయునది యెయ్యది నాకుం జెప్పవూ" యని సిద్ధుండడిగె, అందుకుఁ గల భాషిణి

క. ఈవేళన యాతనికడ కేవిధమునైనఁ జేర్చుటింతియ తక్కం
   ద్రోవమటిలేదునన్నుం గావన్ క్షణభంగరములు కాంతలతాల్మల్

క. తదుపాయము దిద్దుటకున్
    మది నెన్నఁ బ్రభావాఘనులు మఱి లేరు మహా
    భ్యుదయానుభాపగుణసం
    పదఁ బొదలిన మీరతక్కఁ బావనచరితా"

 అన విని సిద్ధుఁ డట్లనియె

క, “మించుగ మూగురువులు శి
    క్షించిన యా యొక్కిరింత సింగమునకు నూ
    హించ నొక నాల్గగడియల
    సంచారము వలయు నతని సన్నిధిఁ జేరన్.

దీని కెంతవలసిన నేమి యిదిదడవం బనిలేదు. నిన్ను దీనిపై నునిచికొని పోయెద నలటినేని యోపూఁబోడి! తోడిసిధులిది వేఱ"క్కలాగుగా నెంతు రెవ్వరి యంతస్సారం బెవ్వరెఱుదు రదియునుంగాక మీ బోంట్ల సంస్పర్శమాత్రంబున స్మదాదులకు సమ్మతింప నుచితంబుగాదు, మఱివేఱొండు సామర్ధ్యంబు లేదు. నాకుఁగల దూరదృష్టిదూరశ్రవణశక్తి యిం దేమియుఁ నుపకరింప దింక నీవు చెప్పినప్రకారంబుగావించెదఁ జెప్ప," మనుటయు নতত సిద్ధునకుఁ గలభాషిణి యిట్లనియె.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/58&oldid=153017" నుండి వెలికితీశారు