పుట:Leakalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మలు పచరించువారము గాము, గూఢప్రకారంబున నిలుపనోపు దేని నీ యుపచారంబులు గైకొనియెద" ననుటయు "నట్ల చేయుదున"ని తన గృహారామంబునంద నిలిపి యతిరహస్యం బుగా నా సిద్ధునకు నిష్టంబులైన యన్నపానాదుల మోదం బొనర్చుచు నచ్చట నెవ్వరింటోనీక తాన పరిచర్య సేయుచు రెండు మూఁగుదినంబు హృదయంబు రంజిల్లఁ జేసి యంత నంతరంగంబున నలకూబరసంగమూభిలాషo బతిశయిల్ల నతని ప్రియవనితయైన రంభ తెఱం గెఱుంగుటకుఁ గ్రమంబున బ్రసంగము దిగిచి సిద్ధునితో "నోమహాత్మ! యిత్తరి నలకూ బరుండు తన వల్లభకు దవ్వై యెందున్నాడొకో? అతనిని బరి కించి చూడవలయు" ననుటయు సిద్ధుండు నవ్వుచు, “నీకదియే ప్రధాన ప్రయోజనం బని" పలికి యిటునటు బరికిoచి చూచి, యతఁడున్న చోటు కని, కల భాషిణి కిట్లనియె,

ఉ. “తా వెనువెంట దాయక సదా చరియించినఁ దద్వినోద మో
     దావృతిఁ జిక్కి రంభ తగినట్టి తపోహతి సల్పలేదు, కో
     సావహ మింద్రుబుద్ధి కది యట్లగటం బ్రియఁగూడి యట్టికా
     ర్యావసరంబులందు జనఁ డాతఁడు మానఁడు పెన్విరాళిచేన్,
క. కావున మణికంధరుని త
   పోవనము సమీప భాగమున నొకవనిఁ జూ
   తావళిలో నున్నాఁడదె
   పూవులను జిగుళ్ళ నొప్ప భూజము క్రిందన్
గీ. తరుణీ యిప్ప డాతనిపైఁ
    బరాకుచే నీవు గానపాటవగుణముం
    గరము మెఱయింపలే వే
    నరిగెద మఱి లేదె యితరమగుపని యిచటన్.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/57&oldid=153016" నుండి వెలికితీశారు