పుట:Leakalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే, అనిపలుక, మాటమాటకు నద్భుతంబు
    చాలఁ బ్రబలంగ విని విని, యా లతాంగి
    కరసరోజముల్ ముకిళించి, కరము వినయ
    మతిశ యిల్లగ నిట్లను నతనితోడ.

క, "ఓయనఘ! దేవుడవొ యో
     గాయత కపిలాదిసిద్ధులందు నొక డవో
     నీయనుభావం బద్భుత
    మై యున్నది, నామ మొద్ది యానతి యీవే!"

అని పలుక “జలరుహానన! నీ వెంచిన వారలలో నె వ్వాఁడను గాను. మణి స్తంభుండనుసిద్ధుండ"నని, యూతండనుటయుఁ గలభాషిణి యిట్లనియె, "ఓ మహితాత్మ! మీ వచన - మొక్కొకటే పరికించి చూచినంత నా మనంబున నబ్బు రంబు ఘనం బగుచున్నది. ఎంచి చూడ, మీ కిమ్మహినిఁ గాన రానియది యేమియును లేదు. స్త్రీ స్వభావంబున మిమ్ముల నేనొకటి వేఁడిన, మన్నింప వలయు, గానవిద్యా పరిపూర్తియైన వెనుక, నారదశిష్యుండగు మణికంధరుం డేమేమి సేయుచుండె, కరుణించి యాన తీయవలయు."

దానికి మణి స్తంభుఁడు,“మణికంధరుండు వీడ్కొను నవస రంబున, నారదుండాతని కిట్లనియె, తొల్లి తుంబురునకు గాన విద్యా కౌశలంబున నోడి, నే నీనాఁడు కృష్ణుని వలనను, నతని దేవుల వలనను శిక్షితుండనై, యనుపమ సంగీత కౌశలాఢ్యుండనైతి.

క. ఏ నిన్నిపాట్లఁ బడి యీ
   గానమహిమఁ గంటి నీవుఁ గలభాషిణియున్
   మేను చెమర్పక యుండం
   బూనితి రిది యప్రయాసమున హరికరుణన్.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/52&oldid=153011" నుండి వెలికితీశారు