పుట:Leakalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. లలితపుభూతిపూఁతయును లాతప్పఁగోలయుఁ గక్షపాలయున్
    మలకొనుచిన్న కెంజడలు మందుల పొత్తము నాగబెత్తమున్
    లలిఁ గనుపట్టుకిన్నెరయు లాహిరి మోదము సింగినాదముం
    జెలు వలరంగ నొప్ప నొక సిద్దుఁడు సింగపువారువంబుతోన్.

తే. అభ్రపదవి నే తెంచి యుయ్యబల యున్న
    తోఁటలోనికి డిగియె నద్భుతము గాఁగ;
    నదియుఁ దన్మహిమకు వెఱఁగందు మనము
    నల్ల నూల్కొల్పి యర్ఘ్యపాద్యాదు లొసఁగె.

తే. అతడు “నో కలభాషిణి యాత్మగురునిఁ
    గృష్ణుఁ గొలువఁగ నేగుదే; గీతవిద్య
    పూర్ణముగ నేర్చితే? రాకపోక లిపుడు
    మానినాఁడు గదా దివ్యమౌనివరుఁడు.

క. దానంజేసియ నీకును మానస మితర ప్రచింత మాని తిరముగా
    నానలకూ బరునంద యధీనంబై నిలిచి యున్నదియె? తరలా క్షీ!

చ. కడపటినాఁడు నిన్ను నిటు కాంచనగర్బతనూజుఁ డంపచోఁ
    గడమయభీష్టసిద్దియును గాఁదగదీవన యిచ్చెఁ; గావునం
    బడఁతి! యమోఘ మాయనఘుపల్కు; చలింపఁగ నీకు తాల్మి, నీ
    బడలుటఁ జూడనోపుదురె ప్రాణసఖుల్ క్షణమాత్రమేనియన్?

సీ. తడవులనుండి యుఁ దపము సేయఁగఁ బూని
    మణికంధరుఁడు పాట వూని యునికి,
    నుపవాస భేదంబు నపనయింపఁగలేక
    వ్రేఁగుచున్నవి నాదు వీను లిపుడు;
    వీణె వాయింపు మోవెలఁది! నేఁడైన దు
    ష్టిగ విని పారణ సేయుఁ గాని
   యీ భువనముల మీయిరువుర
   గానంబ కాని యన్యము లింపు గావు నాకు”

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/51&oldid=153010" నుండి వెలికితీశారు