పుట:Leakalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనుడు 'ఓ యనఘ! మిమ్ములఁగొలుచుపుణ్యంబున కిదియరుదయ్య? తన్నందిన వారు తనంత లన లోకోక్తి వినమె! అది యట్లుండె; నే కొదవయులేక సదా నివాసముగ వైకుంఠంబుననుండి యూసదయుని విష్ణునిఁ గొల్వఁ గల్లెడు నున8 భాగ్యంబు నా కెటులబ్బునో యానతీయవలయునని మణికంధ రుండు వేఁడిన, నారదుం డతని కిట్లనియె. మణికంధర! నీ వత్యనఘుఁడవు. మేలు! మేలు! ఈ యనుపమ బుద్ధి యేరికైనను గలదే! పుణ్యంబును, బాపంబును; విధియును, నిషేధంబును; మేలును, గీడును; బరలోకంబు నను వానింగూర్చి విననివారు లేరు. గాని యాత్మహితం బెద్ది, యది తలఁప లేరు.

చ- అలయక వేదశాస్త్ర సతతాభ్యసన వ్యసన ప్రసంగతిం
    దెలివి యొకింతఁ గాంచినగతిన్ నుతికెక్కియు వెఱ్ఱిదీరె రోఁ
    కలి దలఁ జట్టుమన్న క్రియఁగా నొకకొందఱు దల్లు రప్పటిం
    గలుషపథప్రవర్తనమె కర్మపువాసన నన్యుఁ గొల్వఁగన్.

గంధర్వనందన! వినుము. విద్వాంసులందు విదితార్థ కృతిలోలహృదయులు ముఖ్యులు. వారిలోఁ గర్తలెంతయుఁ బూజ్యులు. కర్తలందు బ్రహ్మవిదు లెక్కుడు. ఆ మీఁదఁ బరమ మొకటి కలుగ దనుచు మున్ను మనువు పలికె. ఈ త్రోవలు కరంబు దూరముగఁ ద్రోక్కిన వాఁడవు, లక్ష్మీవరు నిత్యసన్నిధి విశేషమహత్త్వ మెఱింగియా విభవంబు గాంచుటనాసయొునర్చితి. కావున నీ వడిగిన యద్దేవుని యనవరత సన్నిధి మహత్త్వవిశేషా వాప్తికిఁ బెద్దలచే నే వినినయు పాయ మెఱిఁగించెద

క. ఆధికారి కానివానికి నధికపదవిఁ దెలుపఁ బ్రాప్తమయ్యెడు
    పాపం బధికారియైనవానికి నధిక పదవి చెలుపకున్న నగు నిక్కముగన్,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/53&oldid=153012" నుండి వెలికితీశారు