పుట:Leakalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని యిట్లని చెప్పె,

సీ. “తనశక్తికొలఁది సత్కర్మము ల్ఫల వాంఛ
     మాని కృష్ణార్పణమతిఁ జలుపుట
     ప్రతిషిద్ధకర్మంబు పరిహరించుట విష్ణు
     భక్తిపైఁ గ్రమమునఁ బాదుకొనుట
     తద్భక్తిగలపుణ్యతముల సంసర్గంబు
     దుర్జను లున్నట్టి త్రోవఁ జనమి
     విష్ణుసన్నిధికళావిఖ్యాత వివిధ ది
     వ్యక్షేత్రతీర్థయాత్రాచరణము

గీ. బ్రహ్మచర్యంబుఁ దపము వైరాగ్యగుణము
   వలయు వైకుంఠమును గోరువారి కెల్ల
   వీనిలోపలఁ గొన్ని గావింపఁ గనిన
   వృథఁ జనపు చేర్చుఁ గ్రమమున విష్ణుపదము."

అనిచెప్పి నీవు నిజశక్తి కొలదిఁ నిందుఁ బ్రవర్తిల్లుము. కృష్ణానుగహమునం గలిగిన యీ యనన్యసాధారణసంగీత చాతుర్యంబు వృథ సేయక శ్రీ పురుషో _త్తమశ్రీరంగాదిదివ్య శేత్రములందు ముకుందసన్నిధిం దద్దివ్యగుణనామసంకీర్తన గానంబు గావింపు మది సకలశ్రేయోనిదానం బని పలికి తత్ప సంగవచనంబున,

ఉ. అక్కజమైన భక్తి దనరార నతండనయంబుఁ గృష్ణునిం
    దక్కక యాత్మ జూచిఁ ప్రమదంబునఁబొంగుచుఁజెంగలించుచుఁ
    జొక్కుచుమ్రోక్కుచుం బొగడుచుంబలికించుచుఁగన్ను మోడ్చుచు
    న్మిక్కి-లి చోద్యమందుచును మెచ్చుచుఁ బాడుచు నాట్యమాడుచున్,

క. కేవలము నతి ప్రేమ
   సావేశవశంవదాత్మడై తగ్గుణముల్

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/54&oldid=153013" నుండి వెలికితీశారు