పుట:Leakalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వర్ణనములం దతిశయోక్తి చెల్లునంచు నిటూడితిరి. ఇంతియ కాక, యే యంగనలును మమ్ములఁ బోలఁ జాలరనుట కీయర్థ పతి, ముద్దుకుమారుడే సాక్షి" యనియె. అంతనల్లన నగుచు, మునిపల్కె "నిర్భరంబగు పేమ రాజిల్ల, నీచెల్వుడిట్లు వర్తిలుటం జేసి, యెట్లాడిన నీకుఁ జెల్లు గదమ్మ! అయిన నిట్లు రా వెల్లదినం బులును; సవతి యుగతిఁ గల్లునో మీఁదుఁ గంటివే !

క. నినుఁ బోలువనిత నీకును -
   వనజముఖీ ! యితనిఁ బోలువాఁ డితనికి నెం
   దును గల్గి కలఁచునో ! యి
   ట్టినిగాఢపుముదముసౌంపుతీవులు చనునే?"

క. అనుటయు "నవ్వుల కనినన్
    మునివర! మీ మాట యిట్లమోఘం బగునో!
    వినలే నిట్టివి మానుఁడు
    నను మన్ననచేసి" యనుచు నాతుక మొక్కెన్.

అంత నమ్మహామునీంద్రునియాజ్ఞానుసారంబునం దద్వి మానంబు కల భాషిణి విహరించుచున్న యొలఁదోటలోనికిందగియె, నట్టి యెడ రంభానలకూబరులు వినయపూర్వకంబుగా నతనిచేత ననిపించుకొని, యప్పడెదుటఁ గాన్పించు వాసుదేవుని ప్రాసాదరాజంబునకుం జెయ్యెత్తి మొక్కి, తమ విమానంబు తోడ నిజేచ్ఛం జనిరి. కల భాషిణియు నటమున్ను తన కనతి, దూరంబున వినంబడువారల సల్లాపంబు లాలకించి యుండి, తద నంతరంబ ధగద్ధగితదిగంతరం బగుచుం జేర నేతెంచు విమానంబు నవలోకించియు నాశ్చర్యంబు నొందుచుండి యప్ప డట్లరుగు నల కూబరునిరూపలావణ్యాదిసౌభాగ్యంబునకు మిక్కిలి మెచ్చు చుఁ దదాలోకనంబునం దనియక, కొంత మేర తద్విమానంబు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/49&oldid=153008" నుండి వెలికితీశారు