పుట:Leakalu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయాద్రి మఱుంగుఁబాయు బాలారుణ భాను బింబము మాడ్కి విమాన రాజంబు మబ్బు వెలువడి, యా మునీంద్రు పదాంభోరుహముల క్రిందిచాయఁ బోయి నిలువ రంభానల కూబరులు పారిజాతకుసుమ సౌరభంబులు వెదచల్లు తమ శిరం బుల నాతని పాదంబులకు మొక్కి- నిలిచిరి; ఆ వరమౌనియు "మీర లొండొరులపై వదలని పేమ కలిగి భాసిలుడ"ని దీవించె.

రంభ దరహాసముతో,

క. “ఓమునివర! మీ దీవన
    చే మాపైఁ బ్రేమకొంత చెడక నిలుచునో
    యేమో కాని, యిఁకన్ నర
    భామల పోఁడుముల కితడు బ్రమయక యున్నే?”

అని తన మనంబునం గల యీరసంబు సైరింపఁజాలక యొక్కసక్కియంబుగా నాడు మూటలకు సందియoబు నొందుచు, "నిదియేమి యనుట వివరింపు'మని, మునివరుండు నిలిచి యడుగ, నప్పడంతి "మౌనివర్యా ! అప్పడు మీరలా డోలికా విహారిణుల ప్రసంగంబున శిష్యునితోడ నేమని పలికితి రది యానతీయవలయు" ననుటయుఁ, జిఱునగవుతో నతండు "తా రచించిన పద్యంబుఁ జదివి, "యిందేమైనను గానితెఱంగు కలిగినం జెపునూ; యింక మనంబులోని భరంబు దాఁపం బని యేమి?" అని పలికె. అవ్విలాసిని యతనిం జూచి, -

క. "మీరలు పెద్దలు త్రైలో
     క్యారాధ్యుల రేమియన్న నంటిరిగా కె
     వ్వారలు మాన్చెద ? రిట నే
    మారస్ యాడీతిగొ ? యనుచు నడిగితి ననష్టూ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/48&oldid=153007" నుండి వెలికితీశారు