పుట:Leakalu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ రమణీశిఖామణి యొక్క నాఁడు సింగారములు మెఱయఁగాఁ జెలికత్తెలతోడ వసంతోరు విలాసభాసురంబును, గ్రోత్త విరిగుత్తుల నేత్రపర్వంబును, నగు పురోపవనంబున కేగి క్రీడింపుచుండె. అయ్యవసరంబున నారదుఁడు, తనశిష్యుండగు మణికంధరుండను గంధర్వకుమారునితోఁ గృష్ణ సేవార్థము గగనమార్గంబునఁ జనుచుండ, మణికంధరుం డా మగువల ప్రగల్పతాగరిమ కచ్చెరువొంది వారి లీలల నీరీతిని వర్ణించె.

మ. తమిఁ బూఁదీగెలతూఁగుటుయ్యెలలఁ బంతాలాడుచుందూఁగు నా
     కొమరుం బ్రాయపుగబ్బిగుబ్బెతలయంఘ్రల్ చక్కఁగాఁ జాఁగి మిం
     టి మొగంబైచనుదెంచురీవి గనుఁగొంపే? దివ్యమౌనీంద్ర; నా
     కమృగీ నేత్రలమీదఁ గయ్యమునకం గాల్ దాఁచులాగొప్పెడున్.

అనుటయు నారదుండు

మ. “భళిరా ! సత్కవిమౌదు నిక్కమ తగన్; భావించి నీ వన్నయా
     యెలప్రాయంపుమిటారిక తైల బెడం గే నెందునుం గాన; వా
     రలడోలాచలనోచ్చలచ్చరణముల్ తైవిష్టప స్త్రీలయౌ"
     దలఁ దన్నం జనునట్లు మించెననినంద ప్పేమి యొప్పేయగున్."

అని పలుకునపుడు వారి నికటంబున మొుగులు మఱుఁ గున, నలకూబరసమేతంబుగా దివ్యవిమానంబునఁ జనుచున్న రంభ, యామాట లాలించి, యొకింత కనలి, మన సౌకలాగై, భావవికృతి నెఱుకపడనీయక, తనదు ప్రియు ని మొగముఁజూచి,

క. “ఆలించి తె? యాపలుకుల
    పోలికఁ దెలియంగఁ గలహభోజనమునిగా
    బోలు! మన మితనిఁ గని యుచి
    తాలాపము లాడి చనుట యభిమత" మునియెన్.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/47&oldid=153006" నుండి వెలికితీశారు