పుట:Leakalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రిందటిచాయం బొదరిండ్ల యూరమిమఱుంగున వారిసల్లా పంబు లాలకించుచుం జని, యంత నది మిక్కిలి దూరంబుగా నేఁగుటయుఁదిరిగి వచ్చి కడుఁజేరువ నా యనుపమ తేజుని నారదముని గాఁగ నెఱింగి, ప్రణమిల్లి లేచి, విరచితాంజలియై, సవినయంబుగా నడిగె "మౌనీంద్రచంద్ర! యిపుడు విమానముతో నేఁగినట్టి మహితాత్ములు రంభానలకూబరులె?" అందుకు నారదుఁ“డగు, నీ వెబ్లెఱింగితి మింట మేమూడు కొనిన పలుకులు వింటివో! వలవనిగర్వంబునఁ గన్నుగాన కాడెడి యనుచితవాక్యంబు లేరికైన నెట్లోర్వగవచ్చు? ఏ మింతవార మనుకొన నేరికిఁ జెల్లును రంభకు సవతి యన నొక తెను భువి లోపల వెతకఁ బోవలయు నె? ఓ ధవళాకీ! దైవమనుకూలింప నా సవతివి నీవ కానేర వె? రంభ మొదలగు నే యచ్చరలకు నైన నీదురూప సౌందర్యమహిమ లెక్కుడు గాక తక్కువె? అది యటుండ నీవు నలినాథుకొలువున గానవిద్యను మెప్పవడసి యున్నదానవు, పేరునఁ గలభాషిణివి గద! బిరుదుచదుర వగు దువు. అంబుజా కుకొలువు వేళాయెఁ, బోవలయు"నని, కల భాషి ణికిం జెప్పి యచ్చోటు గదలి చనియె. కల భాషిణియు నంతఁ దనుఁ జేర వచ్చిన నెచ్చెలులుం దానును నిజగృహంబున కేఁగి, వేగంబ కొలువుసింగారంబు సంఘటించుకొని, కృష్ణుని నగరి కరిగె.

అంతఁ గొంతకాలంబునకుఁ గల భాషిణి తనచిత్తంబు నల కూబరచింతాయత్తం బగుచుండ దత్సమీపగమనంబున కుపా యంబు గానక బహుకాలంబు గడిపి. కాలయూపనంబు దుష్కరం బగుటయు, నొక్క నాఁడు దా నొక్కతియ వీణెఁ గొని,గృహారామంబున కరిగియుండు నంత,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/50&oldid=153009" నుండి వెలికితీశారు