పుట:Leakalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేకపోయినా, పెద్ద చదువరివలె ధనికుడివలె బింకాలు నరకుతూ పోజులు పెట్టే, నవీన విద్వత్సోంబేరుల దుర్లక్షణాలను కనుపరస్తాడు. వీని మాటలలో దేశాభిమానం నేషనల్ రిఫారమ్ మొదలయిన పెద్దపోజులు కనిపిస్తూ బుద్ధులు మాత్రం నీతివిహీనంగా వుంటవి. బ్రతుక నేర్చినవాడు. గడుగ్గాయి. సమయము గుర్తించి నడువ నేర్చిన లోకసంచారి. శృతి పాండిత్యానికి, వచ్చిన నాల్గుముక్కలను పెళపెళ డబాయించడానికి లోటులేదు. ఆ డ్రెస్సు. ఆ నడక, ఆ చుట్టపీల్పుడు, ఆ యొడుపులు, ఆ పలుకులు, మన దేశంలో మరే వేషానికి యొప్పియుండలేదు. కానీ గిరీశం అడ్డంకుల దప్పించుకునే యుక్తి కలవాడైనా బండ బారిన దుశ్చింత కలవాడు. కొన్ని సందర్భాల్లో పిరికితనము బెదురుపాటు, తన తెలివికి తానే సంతోషించుకొను లేతబు కలవాడు. ఈగడుగ్గాయి కెదురుగా వెంకటేశాన్ని అమర్చాడు మా ముత్యాలసరములుగూర్చే మేటి కోవిల. చదువుకు పట్నాలు జేరి పల్లెటి పొలాలలో గేదెలు కాచే బుద్ధిమాంద్య మింకా వదలక, బాగోగులేమీ తెలియక, పోజులుపెట్టే పెట్టే వాళ్ళ సాంగత్య మభిలాషించుచూ, మంచికన్న చెడ్డను లీలగా నలవరచుకొను మూఢవిద్యార్థులలో వెంకటేశం వొకడు ఇప్పటి రౌడి పరిభాషలో పల్లెటిగబ్బిలాయి; గబ్బిలాయికూడా కాదు, కోటులేకుండా, ధోవతిలోపల మడచిన షర్టుమీద వంకరగా ఫరంగీకంటాభరణ పీలికను ధరించువాడుకాడు. కాని వట్టి యవివేకి, విశ్వాసి, తెలివి లేమిని సర్వదా సర్వత్ర గనపరచ జడసత్వము, గిరీశమెంత పోకిరీజాణయో వెంకటేశమంతట ముగ్ధచేతస్కుడు. బుచ్చమ్మకూడా వట్టిముగ్ధయే. వీళ్ళిద్దరూ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/30&oldid=152989" నుండి వెలికితీశారు