పుట:Leakalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యాశుల్కపు కూర్పును నిన్న మెచ్చుకోనివారు లేరు. వీరేశలింగముగారు రెం. సు గారు, న్యా. సు; జ. రా, గారు * మొదలగువారు మిగుల సంతోషపడిరి. మీ యొద్దనుండి పుస్తకములరాక కెదురుచూచుచున్నాడను, చిత్తగింపుడు.

  • * *

లీలావినోదా! రామచంద్రా!

అప్పారావుగారు యెట్లాంటి నాటకరత్నాన్ని కల్పించాడని మనవిచేయను! చూడడానికి పెద్ద నవలవలె వుంటుంది కాని, ఆడవచ్చేసరికి కన్యాశుల్కంలో కనుపించే పోకడలు, స్వభావాలు ప్రత్యేక వికాసాలు, తళుకు సొబగులు, మరెక్కడా కనబడవు. పేరునుపట్టి విచారిస్తే కధంతా లుబ్ధావధానుల వ్యవహారం, అగ్నిహోత్రావధానుల కన్యావిక్రయ వ్యాపారం మటుకే వుండవలసి వుంటుంది, ఇందులో గిరీశం చేసేపని యేమీ కనిపించదు. మధురవాణి రామప్పపంతులు, కరకటశాస్త్రీ పన్ని దానికి తెలిసియు, తెలియకను, తోడ్పడుటకును అవసర మయి యుండవచ్చును, కాని అక్కడకూడ పిల్లను కొనుక్కొనే ముసలిలోభికి కలగవలసిన శాస్తి దుష్పరిణామము చూపించడానికే వీరుచేసిన కథాభాగము జతయైనది. గిరీశం వృత్తాంత మంతా కన్యాశుల్క గాధకు సంబంధించి లేదు. కాని అప్పారావు గారి యీ యొక ఆటలో అనేకరకాల సాంఘిక దుర్నీతులను చూపించ నెంచాడు. ఒక చెంప గిరీశం కొంచెమింగ్లీషు నేర్చి, దొరల తరహాలు పట్టించుకొని, చదువెక్కువ అంటకపోయినా, డబ్బు దుగ్గాణి, పేరు పెంపు, వుద్యోగము సద్యోగము యేమీ


  • రెంటాల సుబ్బారావు; న్యాయపతి సుబ్బారావు; జయంతి రామయ్యగారలు కాబోలును.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/29&oldid=152988" నుండి వెలికితీశారు