పుట:Leakalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రచురణకర్తలకు జాబు వ్రాశాను. దయవుంచి నాటకముపై ఒక సమీక్షను వ్రాసి ప్రముఖ తెలుగు పత్రికలలో ప్రచురింపిం చండి. ఇతివృత్త స్వీకరణలో, విర్వహణలో, హాస్యరస పోషణములో, పాత్రోన్మీలనములో, తెలుగు సాహిత్యములో ఇది అత్యుత్తమ నాటకమనే విషయాన్ని మరవకండి.

మీరూ అమ్మాయి కులాసాగా వున్నారని తలుస్తాను. మీ నాటకసమీక్షను ఆంధ్రప్రకాశికకు పంపమని నా కోరిక.

స్టోన్ హౌసుపేట
10 మే 1909

పియమైన మహాశయా, *

అతిదయతో మీరు వ్రాసిన ఉత్తరం నాకిప్పడే అందింది. మీరు ఉదకమండలంలో వున్నారనుకున్నాను. ఎక్కడ వున్నదీ నిర్ధారణగా తెలియక మీకింతవరకు ఉత్తరం వ్రాయలేకపోయాను.

నేను కులాసాగా వున్నాను, నా వృత్తి వొక సమస్యగా పరిణమించి నన్ను వేధిస్తోంది. ఈ ఉపాధ్యాయవృత్తిమీద నాకు వుండే వ్యామోహం తీరిపోయింది. ఇక యీ ఉద్యోగం చేయ డానికి నాకు మనస్కరించడం లేదు. వీలయితే వొదులు కుందామనుకుంటున్నాను. ఉపాధ్యాయుడికి కష్టమెక్కువ; ఫలితం తక్కువ ఇప్పడు నాజీతం ముప్ఫైఅయిదు రూపాయలు. వచ్చే యేడు నేను ట్రెయినింగుకు పోవలసివుంది. నన్ను యేంచేయ


  • మహాకవికి, శ్రీ ఒంగోలు ముని సుబ్రహ్మణ్యముగారు వ్రాసిన లేఖ.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/21&oldid=152983" నుండి వెలికితీశారు