పుట:Leakalu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంటారో తగిన సలహా యీయమని నేను మిమ్మల్ని చాలాకాలం క్రితం కోరాను. కాని మీరింతవరకు ఏమాటా చెప్పారు కాదు. మా తల్లిదండ్రులు వంగోలులో క్షేమంగా వున్నారు. వేసంగి సెలవులు నేటితో ప్రారంభం. స్కూలు మూసివేశారు, వొకటి రోజుల్లో వంగోలు వెళతాను.

ముద్రాపకులు కన్యాశుల్కము మొదటి 128 పుటలు నాకు పంపించారు. దాన్ని నేను జాగ్రత్తగా చదివాను. ఇది వరకటికంటె నాటకం గొప్పగా మారిపోయింది. హాస్యరసం చక్కగా పరిపోషితమయింది. నాటక ఉదాత్త లక్షణాలను నేను బాగా అనుభవించగలిగివున్నాను. నా మిత్రుడు సహాధ్యాయి శ్రీ యం. శివకామయ్య, బి.ఏ., దీన్ని చదివి పరమానందభరితు డౌతున్నాడు.

ఉపాధ్యాయునిగా, విటునిగా, సంఘసంస్క_ర్తగా, రాజకీయజ్ఞనిగా నేటికాలపు వాచాలునిగా యువకుడు గిరీశం తన నిరుపమాన సామర్థ్యంతో మనల్ని నిరంతరం ఆనందింప చేస్తూవుంటాడు. మన సమావేశాల్లో సంభాషణల్లో జీవిత ఘట్టాలలో అన్నిట అతని స్మృతి మనల్ని విడనాడక ముగ్ధుల్ని కావిస్తుంది, అగ్నిహోత్రుడు లుబ్ధుడు పూర్వాచార పరాయణులైన ఛాందసబ్రాహ్మణుల మనస్తత్వానికి ప్రతిబింబాలు. ఈ ఇద్దరూ విభిన్న ప్రవృత్తులు గల సమర్థులైన యిద్దరు వంచకుల చేతుల్లో పడి మోసపోతారు. ఈ నాటక ప్రధాన కథా సూత్రాల్ని, నామౌచిత్యాన్ని పరిపోషిస్తున్న పాత్రలు బుచ్చమ్మ, మీనాక్షి. బాల వితంతువులకు ప్రతిబింబా లనదగిన వీరి స్వభావం విభిన్నం. ఒకతె నిర్య్వాజమైన పేమ స్వభావం గల అమాయిక. ఇంకొకతె తాను పట్టిన పట్టు సాధించాలను

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/22&oldid=152984" నుండి వెలికితీశారు