పుట:Leakalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోతుందని భయపడేందుకు అది బ్యాంకువంటిది కాదుకదా ! కనక ఆ భయం మన నటులకు లేదు.

ఎమెచ్యూర్ నటులకు తీరిక వుండదు. వృత్తిగా నటించే నటులకు తీరికవున్నా వచన నాటకమంటే నిర్లక్యం. పాత్రను క్షుణ్ణంగా అర్థం చేసుకుని నటించడమనేది మొదలేలేదు, నోటికి రావలసిన ఆ నాలుగుముక్కలూ కంఠస్థం చేస్తారా అంటే అదీ కనబడదు. మొత్తంమీద అటు వాళ్లు యిటు వీళ్లు వచన నాటకాలను అలక్ష్యం చేస్తున్నారు. ఇది నా అనుభవం.

చాలాకాలమై మీ పోషణలోవుంటూ చక్కని కృషి కావిస్తూ గౌరవ ప్రతిష్ట లార్జించుకున్న జగన్నాధవిలాసినీ నాటక సమూజం, ఉన్నత ఆదర్శాలను ఉపలక్షించి వాటిని సాధిస్తుందని నా ధృడవిశ్వాసం, అనుకోకుండా ఉత్తరం ఊరికే పెరిగిపోయింది. ఆయా విషయాలపై నాకున్న ఉత్సాహమే అందుకు కారణం. మన్నించండి. జగన్నాధవిలాసినీ డ్రమెటిక్ కంపెనీవారి ప్రదర్శనలను చూసే అవకాశం యింకొక నాడు లభిస్తుందని ఆశిస్తున్నాను. 1908 వేసవిలో నే నింకొక వచన నాటకాన్ని ఊటీలో వుండగా రచించాను. కాని వ్రాత ప్రతి ఎంత వెదికినా కనిపించడంలేదు.

ఎక్కహిల్ హౌసు
ఉదకమండలం
7-5-1909

ప్రియమైన కవిరాజా, •

కన్యాశుల్కము అచ్చుఫారములను మీకు పంపమని,


  • హరికధాపితామహులు శ్రీ ఆదిభట్ల నారాయణదాసుగారికి మహాకవి వ్రాసిన లేఖ.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/20&oldid=152982" నుండి వెలికితీశారు