పుట:Leakalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాక సమర్ధులైన రచయితలు నామార్గాన్ని అనుసరిస్తారని నేను ఆశించాను. కాని నా ఆశ నెరవేరింది కాదు. సమకాలిక జీవిత సంఘటనలను యితివృత్తాలుగా పరిగ్రహించి ప్రతిభావంతులైన మీవంటి రచయితలు వాడుకభాషలో మాత్రమే వచన నాటకాలను రాయాలని నా అభిలాష.

వచననాటకాలను అభినయించడం బహుకష్టం. దోష భూయిష్టమైన అభినయాన్ని సాహిత్యాన్ని మన దృష్టిలో పడనీయకుండా గానమూ ఛందస్పూ మరుగుపుచ్చుతాయి; దృష్టిని చెదరగొడతాయి, మనకు సంగీతనాటకాలు కొల్లలు, రంగభూమి మీద వీటి విజయం సాధారణంగా ప్రేక్షకుల తెలియని తనం మీద ఆధారపడి వుంటోంది. సైడుకర్టెను చెంత అపశ్రుతులతో హార్మోనియం మోగుతున్నంతసేపూ ఆనందిస్తూ కూర్చునే పేక్షకులున్నంతకాలం యీ నాటకాలు రక్తికడుతూనే వుంటాయి. వీటికేమీ డోకా వుండదు.

సంగీత పరిజ్ఞానమున్న నటులు అరుదు. కర్ణకఠోరంగా పాడుతూ మన నటులు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఓర్పుపట్టి తగుశిక్షణ పొందితే అభిరుచిగల ఎవరైనా నటించి పరవాలేదనిపించుకోవచ్చును. కాని అధ్యయనమూ అభ్యాసమూ అవసరం లేదనే దురభిప్రాయం మన నటులలో ప్రబలంగా వుంది, నటుల దృష్టిలో అభినయం వొక కూసువిద్య, విజయ నగరంలో పద్దెనిమిదివందల డెబ్బై ఎనభైల మధ్య కొందరు బ్యాంకులను స్థాపించారు. బ్యాంకుల నిర్వహణకు ప్రత్యేకమైన తరిఫీదు అనవసరమని వారి అభిప్రాయం. అందుకని వారు నెల కొల్పిన బ్యాంకులన్నీ దివాలా తీశాయి, మంచి గుణపాఠ మే మరి. అయితే నాటకప్రదర్శనం విఫలమైతే బొడ్డునున్న ముల్లె

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/19&oldid=152981" నుండి వెలికితీశారు