పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నకు గౌరవముండదు. వేదాధ్యయనపరులగు బ్రాహ్మణులు యాగాదులు జేయరు. ఇక పండుగల మాటయు, సాంఘిక సమావేశముల మాటయు చెప్పవలయునా? ఆభరణాలంకృతులగు జవ్వనులు సాయంత్రములందు పురము బయటి తొటలకు బోజాలరు. జనులు తలుపులు దెఱచి నిదురింపజాలరు. వేగముగ్ల బండ్లలోఅడవులకు బోననేగరు. వర్తకులు దేశసంచారము చేయలేరు. జనులు ధనుర్విద్యాబ్యాసము చేయనేరరు. ఊరూర దిగుచు ఎచ్చటకొరిన నచ్చట విశ్రాంతిగొను జ్ఞానులు కానరారు. వసంతకాలపు నవనవలాడు వృక్షములవలె ప్రకాశించుచుండు యౌవనులగు రాకొమరులు కన్పట్టరు. జలములేని నది వలెను, పచ్చికలేని యడవివలెను, పసులులేని కాపరివలెను(?) రాజులేని రాజ్యముండును. శరీరమునకు నేత్రములెట్లు ప్రధానములో, దేశమునకట్లె రాజు ధర్మపాలనార్ధముమవసరము. అహో! మంచిచెడుగులను వేరుపరచు రాజు లేనిచో, ఎచ్చటజూచినను అంధకారము నిండియుండును; ఏమియు కనుప్డదు." #రామాయణములోని సమస్తవర్ణనలవలెనే ఆరాజకమునుగూర్చిన పైవర్ణనకూడ చాలమనోహరముగా నున్నది. దుర్మార్గులగువారి పోకడల నడచుటకు రాజులేని పక్షమున కలుగు అనర్దములను గూర్చి మనవారెంత భయపడుచుండిరో పైవర్ణనయే చెప్పుచున్నది. ఈభయము అతివిస్తారమైనందున జనులు రాజ్యాంగమున శ్రద్ధగొనక, పరదేశీయులైనను సరే దేశమున శాంతిని


  1. అహోతమైవేదంస్యాన్న ప్రజ్ఞాయేతకించన! రాజూచేస్తున్నభవేల్లొకే విభర్జసాధ్యసాదుని: అయో॥