పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

పరచి జనులన్ ధర్మమార్గమున నడిపించెను. కనుక జనులు సదా తమకొరకొక రాజు నేర్పరచుకొనవలయున్." ధర్మమును నడపెదనని మనువును, దానికి ప్రతిగా పన్నుల చెల్లింతుమని ప్రజలను ఒడంబడిక చేసికొనిరను నబిప్రాయము చాలశ్రేష్టమైనదే కాని నిరంకుశప్రభువులు, మనదేశమందేమి ఇతరదేశములందేమి తమ వాగ్దత్తమను చెల్లించుకొనియుండుట అరుదుగా గాన వచ్చుచున్నది.

    ఎంతటి నిరంకుశుడైనను, ఎంతటి భోగపరాయణుడైనను, రాజు, మొత్తముమీద శాంతిని స్థాపించుటయందును, న్యాయముచేయుట యందును సామాన్యముగా శ్రద్ధళువైయుండెను. రాజపాలనమ్న నున్నజనులు అరాజకముగా నున్న దేశములోని ప్రజలకంటే సర్వద ఎక్కువ్బలవంతులుగను ఎక్కువ సుఖులుగను ఉండుచు వచ్చిరి. ఆరాజకమువలన్ నష్టములు ఉభయ వీరకావ్యములందును విస్పష్టముగా వర్ణింపబడియున్నవి. బహుశ: జనులకుగల అరాజకభయమే రాజుల యధికారమును బలవత్తరముగ జేసియుండ వచ్చును. అయోధ్యకాండములోని 67 వ అధ్యాయమున, దశరధుడు మృతినొంది రాముడును భరతుడును దేశమున లేని సమయమున కర్తవ్యమును నిర్ణయించుటకు జనులు సభచేసిరి. ఆసందర్భమున నిట్లున్నది. "రాజులేని దేశమున మేఘములు వర్షింపవు. పిడికెడు డాన్యమైనను విత్తరు. పుత్రులు జననీజనకులకును, భార్యలు భర్తలకును విధేయులుగా నుండరు. ఏమనుజుడును తనసొత్తునుగాని తనభార్య సహవసము గాని యనుభవింపజాలడు. సత్యము