పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

బంధువునకుగాని రాజ్యమియ్యవలయుననియు విధింపబడి యున్నది. దురోధన, యుధిష్టిరుల దిగ్విజ్యమువలన వారిరాజ్యం విస్తరిల్లినట్లెక్కడను కానరాదు. చుట్టుపట్టులనున్న రజ్యములు మాత్రము వారి సార్వభౌమత్వము నొప్పుకొనవలసినదయ్యెను. అల్పరష్ట్రముల స్వాతంత్ర్యమును గౌర్వించునట్టి యిట్టి యాచారము వలననే బ్రాహ్మణములలోను, ఉపనిషత్తుల లోను పేర్కొనబడిన రాజ్యముల నేకములు క్షాత్రయుగముజ్న మాత్రమేకాక, దాదాపు తధ్యుగాంతము నాటివఱకును మనకు కానవచ్చుచున్నవి. కాశీ, కోసల,విదేహ, చేది, శూరసేన, కురు, పాంచాల మత్స్య, వృష్టి, భోజ, మాలవ, క్షుద్రక,మద్ర, కేకయ, గాందార, సింధు. సౌవీర. కాంభోజ, కుశీనర, కిరాత, అనర్త మున్నగు అనేక రాజ్యములవేళ్ళు బ్రాహ్మణుల కాలమునుండి బౌద్ధయుగమువఱకు వచ్చుచున్నవి. రాజ్యపు పేరు సాధారణముగా నచ్చట వసించు తెగవారి పేరునకు బహువచన రూపముగానుండెను. కాశీ రాజ్యనామము మాత్రము పట్టణపు పేరునుబట్టి వచ్చినది. తక్కినవారిలో ననేకములపేళ్ళు రాజూల నామములనుండి వచ్చినవి. ఉదాహరనము కురురాజ్యము, శూరసేనరాజ్యము.

  అసంఖ్య్హాకములగు నీ చిన్నరాజ్యముల నొక్కొక్కరాజు పాలించుచుందువాడు. గ్రీసుదేశమందు, చరిత్రారంభకాలమున పట్టణమున కొకరాజుండెనని మనకుదెలియును. గ్రీసులోవలెనే మన దేశమునందును జనులు (ముఖ్యముగా బ్రాహ్మణులు) రాజుల యధికారమునకుబూర్తిగ లొంగినవారుకారు.