పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి సాధారణ రాజ్యాంగస్థితి.

ముఖ్యములగు నన్నిసమయములదును, జనులందఱు రప్పింపబడి యాలోచింపబడుచుండిరి. రామాయణమునందు మనకట్టి యుదాహరనము దొరకుచున్నది. దశరధుడు శ్రీరాముని యువరాజు జేయదలచినపుడు బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులను రావించి వరి నీ విషమున నభిప్రాయమడుగును.

    రామాయణందీసందర్భమున నిచ్చినవర్ణనము నిజమైనది గా బొడకట్టుచున్నదికాని ఊహాజనితముగా దోచుటలెదు. ఈ విషయమున నేమైని సందేహముండినను, మరియొక సందర్భము నందలి వర్ణన దానిని దొలగించుచున్నది. శ్రీరముడరణ్యమున కేగిన పిద్ప్ దశరధుని మరణానంతరము భవితవ్యమును నిర్ణయించుటకు మరియొక సభ సమావేశమయ్యెను. ఈ సభయందు ద్విజులుండిరి. వీరు మంత్రులతో సమాలోచనము సల్పిరి. *రాముడును భరతుడును (ఇరువురును) లేరు; కనుజ్క వేరొకరాజు నెన్నుకొనవలయునని సైతము సభ్యులు సూచించిరి. ఈయంశములను మనసునందుంచుకొని విచారించితిమేని రాజు అధికారము నిరంకుశమైనది కాక, ప్రజాభిప్ర్రాయమునకు ముఖ్యముగా ఆర్య ప్రజాభిప్రాయముంకు లోబడినదై యుండెను. అప్పటికింకను రాజసత్తాక పద్ధతి (Monarchy) ఆరంభదశయందుండెను. అవ

  1. నానానగరవస్తవ్యా, వృధగ్జాన సదనపి |సమానినాయ మేదిన్యాం, ప్రధాన వృధివీపతి॥ బ్రాహ్మణాలమభ్యాచ్చ, పౌరవద సహ॥అయోధ్యాకాండ॥
  • సమేత్యరాజకర్తార:, సభామీయర్ద్విజాఈ॥అయోధ్యాకాండ॥