పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారివివాహములు.

ఉత్తమరాలగు భార్యలక్షణములను గమనింపుడు. వనపర్వములోని 263 వ అధ్యాయమున ఆమె సత్యభామతో తాను భర్తల సంతోషపెట్టుచుండిన విధమును ఇట్లుచెప్పుచున్నది. "గర్వమును కోపమును వదలుకొని నేను సదాభర్తలకును వారి భార్యలకును సేవచేయుచుందును. తప్పుమాట మాట్లాడుటకును తప్పుగానిలబడుటకును తప్పుగా చూచుటకును అమర్యాదగా గూర్చుండుటకును చెడ్దస్థలములకు బొవుటకును నాభర్తల యుద్దేశముల నూహించుటకును భయపడుచుందును. నేను పరపురుషుని కన్నెత్తిచూడను అతడు దేవుడైననుసరే, యౌవనుడైనను సరే, ధనికుండైననుసరే, సద్వర్తనుడైననుసరే, భర్త భుజింపనిది నేను భుజింపను. ఆయన నిద్రింపనిది నేని నిద్రింపను, భర్త పొలమునుండిగాని, యడవినుండిగాని, గ్రామమునందుండికాని తిరిగివచ్చునప్పుడు *నేను నిలబడి నీరొసగ పీఠమువేసెదను. పాత్రలునున్నగాదోమి అన్నముచక్కగావండి, వేళకు భర్తకమర్చెదను. ఆహారపదార్ధములను బాగుగా గాపాడెదను. ఇంటిని శుభ్రముగా మార్చెదను. చెడ్డస్త్రీల సహవాసముచేయను. సొమరితనమునుమాని సర్వదాబర్తలను సంతోషపెట్ట యత్నించు చుండును. ఎకసెక్కమాడను, నవ్వను, గృహద్వారమున నిలువబడను. బహిరంగప్రదేశములకు తఱుచుగాబోను. ఇంటి యావరణములో చాలసేపు నిలువను. కుటుంబపోషణముకొరకు భర్తదేశాంతరము పోయినపుడు అలంకారముచేసికొనను. భర్త


  • ఇచ్చట ద్రౌపది రాజపత్నిగా మాట లాడటంలేదు. చదువరులాలోచింతురు గాక.