పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నేటికిని మఱింత వికృతాకారముతో మన యిండ్లయంద్సున్నదని వేఱుగ జెప్పవలయునా?

  వ్యాసుని ద్రౌపది ఎట్టిదో చూడుడు:- వివాహంకాలమున ఆమెయౌనవతి శరీరార్డ్యము మనోబలముకలది. ఆమె పాణిగ్రణము చేయుటకై కాంపిల్య నగరమునందు సమావేశులైయున్న రాజన్యుల సభయెదుటికి నిర్భయముగా వచ్చెను. కర్ణుడు మత్స్య యంత్రమును దెగవ్రేయుదలచి ముందడుగిడ అనంతధైర్యముచెడక కొద్దిజాతివానిని నెను పెండ్లియాడనని నిర్భయముగా వచించెను. బ్రాఃహ్మణవేషముననున్న వాడొకడు తన ధనుర్విద్యాకౌశలమును చూపి  గెలుపొంద ఆమె సంతోషపూర్వకముగా బీదయింటికి పోయెను. తానెదుటలెని సమయమున తన్నుద్యూతమున నోడినపుడును, దాసిగా ద్యూతగృహమునకు దీసికొనిరాబడినపు డును ఆమెతాలిమి గోలుపోలేదు. తనవిపనావస్థ కించుకేనియు తత్తరముచెందక ధర్మశస్త్రానుసారము తన్నోడుట క్రమమా యక్రమమా యను విషయమున నామె చేసినప్రశ్న ఆమెశాస్త్రజ్ఞానమును ప్రకటించుచున్నది. పలుమారు ఆమె "పండితో యనియు "బ్రహ్మవాదిని" యనియు మహాభారతమున పిలువ్బడి యున్నది. వనవాసకాలమునందామెభర్తలతో రాజ్యాంగవిషయములందు తర్కవితర్కముల సల్పెను. వారి కాలోచన చెప్పను. విరటుని యంత:పురమున సైరంధ్రిగా నుండినకాలమున ఎంతోదైర్యముతొ వర్తించి అజ్ఞాతవాస నియమమును జయప్రదముగా గడపెను.
   ఇక క్షాత్రయుగాంతమున ద్రౌపదినోటనెచెప్పింపబడిన