పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారివివాములు.

దంతట నుండెననుమాట నిజమేయైనను, బ్ర్రాహ్మణవివాహములు ఏకపత్నీవ్రతము, వితంతూద్వాహనిషేధము మొదలగునవి జనుల హృదయము నాకర్షించుచుండెను. క్షత్రయుగారంతమున ఎద్దులజతకు కన్యను విక్రయించుటయు, పోతెయందు చూపబడిన బాహుబలము ననుసరించి కన్యనిచ్చుటయు వర్ణాంతర వివాహ నిషెధమును వాడుకయుందుండెను.

     క్షాత్రయుగమునందు భార్యలదశ యెట్టిగానుండేనో విచారింతము,. యీయుగము తదుయందున్న దానికంట్ఘె ఆరంభమున భార్య లెక్కువ స్వతంత్రశీలురాండ్రుగను ఎక్కువ గౌరవనీయరాండ్రుగజ్ను ఉండుటసహము. వివాహసమయమున యౌనవంతులైయుండు కాలమునను కానుకలకు ప్రత్యామ్నాయముగా నివ్వబడుచుండుకాలమునను, స్వయం వరణమాచారముగా నుండుకాలముననను తమ భర్తలనువదలి మరల వివాహముచేసిమొను నధికారముండిన కాలమునను వారు పదక్షణముగ కన్యాదానము చేయబడు చుండినట్టి భర్తతప్ప వేఱుదిక్కులెక యుండినట్టి కాలముకంటె నెక్కువస్వతంత్రము ననుభవించిరనుట స్వతస్సిద్ధము. ద్రౌపదితానుస్వయముగా ననుభవించిన స్వాతంత్ర్యమునకును, పతివ్రతయగు స్త్రీ యిట్టిదిగ నుండవలయునని ఆమె (వనపర్వములోని వర్ణనము ప్రక్షిప్తమనుట కష్టము.)  ఈ వర్ణనము క్షాత్రయుగాంతమున భార్యయగు దాని కుండవలసిన లక్షణములను జూపుచున్నది. ఈయాదర్శమే