పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

తినని వస్తువులు నేనుతినను. ఆయనత్రాగని పదార్ధమును నేను త్రాగను. వంశాచారములను జాగ్రతతో నడుపుదును. కోపావేశాము ననున్నను సర్పలకువలె భర్తలకు భయపడి వారిసేవచేసెదను. పసుల కాపరులు మొదలుకొని అందఱుసేవకులు చేయుబనులను నేను విచారించుచుందును. నేనుమాయత్తను సంతొషపెట్టుచు ఆమెకు అన్నపానముల నమర్చు చుందును. వేషమునందు నేనామెను మించను. బ్రాహ్మణులకును అతిధులకును జాగరూకతతో సేవచేసెదను. స్వసుఖమును పరిత్యజించి రాత్రెందినములు కష్టపడి కర్తవ్యములనెరవేర్చుచుందును. భర్తలకంటె ముందునిద్రలేచి వారు నిద్రించినతరువాత నిద్రింతును. భర్తలు నన్ను ప్రేమించుటకై నేను చేయుచున్న మంత్రిప్రయోగమిదియే"

  కుటుంబ విషయమునకు భర్తవిషయమునను భార్య ఎట్లునడచుకొనవలయునో చూపుటకు ఈవర్ణనబాగుగ సేయుచున్నది. కాని ఇదితగినంతయున్నతముగాలేదు. సుఖదు:ఖములందును అతనికి సయాయముచేయు ఆదర్శభార్యము తగినట్టులేదు. అయినను ఈయాదర్శము హిందూ స్త్రీని సుఖముకలదానినిగాను కుటుంబమున కుపకారినిగాను చేయుటకును, ప్రాప్తించిన దానితొనే సంతృప్తగా జేయుటకును చాలియున్నది. హిందూ స్త్రీలపావిత్ర్యము సుప్రసిధ్దము. సీత, సావిత్రి, దమయంతి, ద్రౌపది వీరి యుదాహర ణములు హిందూవనితలకు సద్వర్తనమును పొగడ