పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి వివాహములు.

(2) అతిబాల్యవివాహములు దక్షినమునందలి అనార్యులగు ద్రావిడజాతులలొ జరుగుచుండెను.

మనుస్మృతి కలలు వివాషములను ఎనిమిది విధములుగా బాగించియున్నారు. వీనిలోని మొదటి నాలుగు, బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రజాపతి పద్ధతులు, ఈ నాల్గు పద్ధతులును వివాహ పద్ధతియొక్క నాల్గు వివిధావస్థలను సూచించుచున్నవి., దేవతలు ఆర్యులకు అతిపూర్వీకులు; ప్రజాపతులు వరి తరువాత వారు; ఋషులు వారికి సమీపస్థులగు పూర్వికులు, దైవ, ప్రజాపతి, ఆర్ష పధ్దతులు పైమూడింటికిని క్రమముగా సంబంధించి యున్నవి. ఇక బ్రాహ్మవివాహము. ఇది గంగానదీ ప్రాంత్ వాసులగు బ్రాహ్మణరులలో నాచారముగానేర్పడిన అత్యుత్తమ వివాహపద్ధతి. ఈ పద్దతియందు కన్యవరునకు అనేక దక్షిణలతొ గూడ దానము చేయబడుఛుండెడిది. తక్కుంగల మూడు పద్ధతులు, వివాహము విక్రయ పద్దతినుండి దానపద్దతి వచ్చువఱకు కలిగిన దశాభేదములు. మొట్టమొదట ఆర్యులు తమ కూతుండ్లను వశ్వాదులవలెనే అమ్మదగిన వస్తువులుగా దలచుచుండిరి. ఈ యభిప్రాయము అసుగులనబడు పురాతన ఇరానియనుల యందు (పారసీకార్యులయందు) విశేష వ్యాప్తి కలిగి యుండినందున దానికి అసుర వివాహమని పేరువచ్చేను. గ్రీకులు మన దేశమునందుండిన కాలములో నీ యాచారము పంజాబు దేశమందలి కొన్నితెగలలో నుండెను. వీరీ యాచారమును సింధునది యావలి గట్టునుండి వచ్చిన కాలమున తమ వెంటదెచ్చికొని ఇంకను మఱువక యట్లే యుంచుకొని యుందురు. మాద్రియు,