పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

జరుపబడు చుండెను. తెలియుచున్నది. బాల బాలికలకు పసి తనముననె వివాహము జరుగుచుండిన ఈ కాలపు సంఘస్థితికని ఆ కాలపు సంఘస్థితికిని చాలభేదము కన్పట్టుచున్నది. బాల్యవివాహములు బౌద్ధయుగమున మన సంఘమున బ్రవేశించి క్రమక్రమముగా పెఱిగి తద్యుగాంతము వఱకు--ముఖ్యముగా క్రీ.శ.900 నుండి 1000 వఱకు స్థిరపడినవి. అనగా బాల్యవివాహములు క్షత్రయుగరంతము నాటికి మెల్లగా నారంభమైనవి. వీరకావ్యములలొ మనకీ విషయమున ప్రమాణములు దొరకవుగాని ఆకాలమందు హిందూదేశమునకు వచ్చిన గ్రీకుల చరిత్రకారుల వ్రాతలలో పైయూహకాధాముకలదు. ఏడు సంవత్సరముల బాలికలను పెండ్లియాడి వారితో గలసియున్న పురుషులు దక్షిణమున నుండినట్లును, వారు దీర్ఘాయువులు కాక 40 సంవత్సరములకు ముందే చనిఫోవు చుండినట్లును గ్రీకులు వ్రాసియున్నారు. ఈ చరిత్రకారులు తాము వినిన యంశముల నెల్లను నమ్ముచు అతిశయోక్తులు వ్రాయుచుండినట్టు తోచుచున్నది. ఒంటికాలి మనుష్యులును, చెవులతొ శరీరమునంతను కప్పికొనువారును ఈ దేశమునం దున్నారని వారు వ్రాసిన వ్రాతలెట్టివో పై యంశమునగూడ వారి వ్తాత యట్టిదిగా మనము నిర్ధార్ణ చేసికొనవచ్చును. కాని రెండు సంగతులు మాత్రము వారి వ్రాతనుబట్టి మన మూహింపచచ్చును; (1)బాలికల అతి బాల్య వివాహములును నిషేకములును ఆకాలమున అస్వాభావికముగాను, అసాధారణములుగాను తలపబడు చుండెను.