పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

కైకేయియు, గొప్పగొప్ప బహుమానములకు ప్రత్యామ్నాయము వరుసగా పాండురాజునకును, దశరధునకును లంబించిన యండుట మన మెఱుగుదుము. మాద్రేయులు, కేకయులు పంజాబునందు వసించుచుండిన పూర్వోక్తములగు తెగలవారు. అలెగ్జాండరుతొగూడ మన దేశమునకు వచ్చిన వారు సయితము "తక్షశిల"లో నిట్టి యాచారమునే కనుకొగి యుండిరి. "తక్షశిలయందు యౌవనురాండ్రగు కన్నెలు విక్రయమునకై యుంచబడుచుండిరి. కొనువారు ముందునకు వచ్చినపుడు వారి భుజములమీది బట్టతీసి చూపుచుండిరి. అందఱికన్న నెక్కువ ధన మిచ్చిన వానికి కన్నెవిక్రల్యింపబడు చుండెను." అని 'ఏరియను ' వ్రాసియున్నాడు. స్కృతి వాక్యానుసారము ఈ పద్ధతి చాల హీనమైనది; ఇట్టి వివాహములు అరుదుగా కొన్ని స్థలములలో మాత్రేమే కానవచ్చుచుండెడివి. అలెగ్జాండరు కాలమున మన దేశమునందు "కాధయులు" ను "సొపైతియులు"ను భిన్నములగు వివాహాచారములను కలిగియుండిరట. వీరు వీరయుగమునాటి "కేకయులు"ను "మాద్రేయులు" ను నై యుండవచ్చును. ఈ రెండు తెగలలో "కాధయ" స్త్రీలుతమ భర్తలను తామే నిర్డేశించుకొను చుండిరి. "సొపైతి" స్త్రీలు వెలల కమ్మబడుచుండిరట. వీరిలో వరదక్షిణయను మాటయే యుండలేదట.*

      ఇక స్వయంవర పద్ధతిని గూర్చి విచారింతము. ఇది రెందు విధములుగా నుండెను. వధువు తన యిష్టమువచ్చిన

  • "అలెగ్జాండర్ల్;ఉని హిందూదేశపు దండయాత్ర" మాక్ క్రిండిల్