పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

వార్ధక్యమున నొకఋషిని పెండ్లిచేసికొనెను. దండునివలన బలాత్కారముగా చెఱుప బడినదగు భృగుమహర్షి కూతురుయుక్త వయసు వచ్చువరకు అవివాహితగానున్న బ్రాహ్మణ స్త్రీయే కదా. ++అనుశాసనపర్వమునందు స్త్రీకి వివాహము కాదగిన వయసు యౌవన ప్రాప్తియే యని స్పష్టముగా జెప్పబదియున్నది.$

  వివాహకాలమున పురుషులు వయసు కూడ స్త్రీలవయసున కనుగుణ్యముగానే యుండినట్లు కానవచ్చుచున్నది. బ్ర్రహ్మచర్యము క్రమముగా పాలించబడుచునేయుండిన పక్షమున వేదములు 12, 24, 36 సంవత్సరములకాలమువరకు పఠింపబది కంఠస్థము చేయబడుచునే యుండిన పక్షమున పురుషులు వివాహము 20 సంవత్సరములకు ముందు అగుచుండగనే  లేదని మనము నిశ్చయింపవచ్చును. చిన్నతనములో స్త్రీ పురుషుల కలయిక కలికాలపు దుర్లక్షణములలో నొకటి యనియు, పూర్వ యుగములందు సంపూర్ణ యౌవనము రానివాడు స్త్రీ నెఱుగడనియు చెప్పబడుచున్నది. ^ ఈ ప్రకారముగా స్త్రీ

++ ఆదిపర్వములోని 153వ అధ్యాయమునందున్న ఈక్రింది శ్లోకమునందు ఒక బ్రాహ్మణుడు బకువ కాహారము కాబోవుచు విలప్;ఇంచుచున్నాడు. దీనినిబట్టి క్షత్రయుగాంతమునగూడ బ్రాహ్మనకన్యలు యుక్తవయసుప్రాప్తవయసమజాతవ్యంజనక్ర్తిం । భర్తరర్ధాల్యనిక్షిప్తం న్యాసంధాత్రాంహత్మనా॥

$ వవస్థాంతుమహాప్రాజ్ఞన్యామావోధుమర్షసి॥

నచస్త్రీయంప్రజనాతి కశ్చిదప్రాప్తల్యామన:॥అను॥