పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి వివాహములు.

బలపడుచున్నది. కాని కొన్నిచొట్ల దానియందు ఈ విషయమున తరువాతి కాలపు టభిప్రాయములు దూర్చబడినవి. ద్రౌపది స్థితియందువలెనే, సీతారాములు మిఃధులనుండి యయోధ్యకు రాగానే నిషేకనం జరిగినట్లున్నది. #

   ఈ యుదాహరనము లన్నియు క్షత్రియ వంశము వారివనియు, రాజపుత్రులలో ఆనాడే కాదు నేటివరకు కూడ పై యాచారమే యున్నదనియు కొందఱు వాదింప వచ్చును. బ్రాహ్మవివాహము ఆచారముగ గల బ్రాహ్మణజాతిలో పైనజెప్పబడిన వివాహపద్దతి యుండలేదని అట్టివారుచెప్పవచ్చునుకని అట్టివాదము సరియైనదికాదు. క్షత్రియకన్యయెంత యుక్తవయసురాక పూర్వమే పెండ్లియైన యొక బ్ర్రాహ్మణకన్యకయైనను వీరకావ్యములయందు మనకు కానరాదు. శుక్రుని కూతురగు దేవయాన మొదట కచుని ప్రేమించి యాతనిచే నిరాకరింపబడి యయాతిని వివాహమాడినట్లు మహాభారతమునందున్నది. పెండ్లి సమయమున నీమె సంపూర్ణ యౌనవతి. వృద్ధురాలగు వరకు అవివాహితగానేయుండి తపము సల్పుచుండిన బ్రాహ్మణ స్త్రీ యొకతె మనకు శల్యపర్వము నందలి 33 వ అధ్యాయమునౌకావవచ్చుచున్నది. స్వర్గమునకు బో దలచినచో వివాహమాడవలసి యుండునని ప్రబోధింపబడిన పిదప ఆమె తుదకు

  1. ఈ సందర్భమున నీ క్రింది శ్లోకము చాలముఖ్యమైనది. ఇది బహుశ రామాయణముయొక్క మూలగ్రంధములోనిదై యుండవచ్చును. అభివాద్యభివాద్యాంశ్చ సర్వారాజనుతాస్తదా । రేసునేయనతా॥ సర్వాభర్తృభి: సహితామవారికి రాజ॥