పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వారి వివాహములు.

పురుషులు సంపూర్ణవయసు ప్రాప్తించిన తరువాత వివాహము చేసికొనుచు, ఆరోగ్యవంతులగు బిడ్డలను కనుచు నుండిరి. $

  ఆచార మిట్లుండి నపుడు స్త్రీ పురుషుల వలన నొక్కొకపుడు ఆక్రమణము జరుగుచుండుట సహజము. వివాహమునకు బూర్వమే కుంతి కుమారునిగనుట ఇందునకు తార్కాణము, మహాభారతమ్లోని యొక శ్లోకమును+ బట్టి, యౌవన వతులయ్యు అవివాహితలుగా నుండిన కన్యల మానసికావస్థ పాశ్చాత్ల్య స్త్రీ పురుషుల యవస్థవలెవ్నె యుండెనని తోచుచున్నది. యుక్తవయస్కులగు స్త్రీల చ్వర్తన్ము మతము వలనను ధర్మశాస్త్రము వలనను కాపాడుబ?డు చుండెడిది. సమ్మతితోనే యైననేమి, ఒక కన్యను చెఱచుట మనుస్కృతిప్రకారము గొప్పదోషము. ఇట్టి దుష్కార్యమునకు పాల్పడిన కన్నె బ్రహ్మహత్యాదోషమున మూడవ భాగమును, చెఱచిన పురుషుడు తక్కినపాపమునుపొందునని మహాభారతము శాసించుచున్నది.++
  పై కారణమును బట్టి, క్షాత్రయుగమునాటి హింద్వార్య్లులలో వివాహములు, కన్యల కన్యాత్వమును పురుషుల బ్రహ్మచర్యమును కాపాడుటకు అవసరములగు నియమములతో

$"టాసిటసు" ఇట్లే వచించి యున్నాడు.

+ప్రధానశాంక్షిణీనాంచ కన్యానాంవయసిస్థితే । శృత్వకధాస్ధధాయక్తా: పాశకృశతరీమయా॥శాం॥

++త్రిభాగంబ్రహ్మహత్యాయా: కన్యాప్రాస్నోతిరుష్యతి: యస్తు దూషయితాతస్యా: శేషంప్రాప్నోతిపాప్మన:॥అను॥కృతము./