పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

దేశమున ద్వాదశవర్షక్షామము మహాభయంకరముగా నుండెను. బ్రాహ్మణులు దేశదేశములకు వెడలిపోయిరి. అప్పుడు కొందరు బ్రాహ్మణులు మాత్రం సరస్వతీ నదీతీరమున మత్స్యాహారవ్రతులై అటేయుండి వేదములను గాపాడిరి. క్షామము పోయిన తరువాత బ్రాహ్మణులు మరలవచ్చి సారస్వతుల వద్ద వేదముల జదివి, వంగదేశ బ్రాహ్మణులును శన్వీబ్రాహ్మణులును సారస్వతుల యాచారమునే ఇప్పటికిని అవలంభించియున్నరు.

   ఆకాలమున హిందువులు సామాన్య్హులుగా భూజించు నాహారము ధాన్యసంబంధమైనది. అందును వారు ముఖ్యముగా వరియన్నమును దినుచుండిరి. సాధారనముగా ధనవంతులును ముఖ్యముగా క్షత్రియులును మాంసముతోగూడ వండబడిన యన్నమును-- ఈకాలమున పొలావు అనబడునట్టి దానిని-- తినుచుండిరి. రాజసూయానంతరము దుర్యోధనుడు హస్తినాపుర మునకు వచ్చి పిమ్మట, ధృతరాష్ట్రుడు కుమారునిజూచి "నిశితౌ దనమును దినుచున్న నీవు ఇట్లు శుష్కించుచున్నావేమి?" యని సభాపర్వమున నడుగును. *ఇదిగాక, క్షాత్రయుగాంతరమున వివిధ జీవితవస్థలలోనుండిన హిందువులెట్టియెట్టియహారమును భుజించు చుండిరో తెలుపు మఱియొక శ్లోకమున్నది. దానియర్ధమిది. "ధనవంతులు మాంసము విశేషముగాగల యాహారమును, మాధ్యమికస్థితిగలవరు పాలును పాలతోచేయబడిన వస్తువులు విశేషముగాగల యాహరమును, పేదవారు

  • అచ్చాదయసి ప్రోనారానశ్నతి పిళితౌదనం, ఆనానేయానహంత్య శ్వా: కేనాసిహరణ:కృళకి సభా॥