పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

ఎక్కువగా తైలపక్వములను తినెదరు. $

   వనపర్వమునందలి 190 వ అద్యాయమునందున్న ఒకశ్లోకము ను బట్టి చూచినచో, ఆర్యులు ఆరంభమున హిమాలయా పాదప్రాంతములందు నివాసముచేసి యుండిరనియు, అచ్చట వరి పంట యుండేననియు తెలియుచున్నది. అప్పుడుమాత్రమేగాదు, హిందూదేశపు ఉత్తరభాగములలోని పర్వతప్రాంతములు నేటికిని సువాసనగల వరిపంటలకు పేరుగాంచి యున్నవి. ఆర్యుల ప్రదేశములనుండి వెడలి వానికంటె నెక్కువయుష్ణముగానుండు మైదానములలోనికి క్రమక్రమము బ్రవేశించిరి. ఈక్రొతస్థలములు నాటికిని నేటికిని గోధుమలపంటలకును యవల పంటలకును యోగ్యములై యున్నవి. "యుగాంతమున జనులు యవలు గోధుమలు తిను స్థలములకుబోయెదరు." *ఈ శ్లోకార్ధమును సమన్వయముచేయదలచినయెడల మ్నము పైయూహనే యాధారము చేసికొనవలెను. దుర్యోధనుని యాహారము విషయమున వచ్చినశ్లోకమునందలి "పిశితౌదన" శబ్దమునుబట్టి చూచితిమేని ధనవంతులగువారు గోధుములకంటే బియ్యము యెక్కువగా వాడుచుండిరని తెలియుచున్నది.
    హిందువులు మితాహారులు, హిందువులకు నిర్ణీతములగు భోజనసమయములే,లేవని గ్రీకులు వ్రాసియున్నారు.  ఈ యంశమును బలపఱచు వాక్యములు కొన్ని మహాభారతమునం

$ అధ్యానాంమాంససపరమం మధ్యాఆం గౌరిసోత్తరం, తైలోత్తరం దరిద్రాణాం, భోజనంభరతర్షభ॥ ఉద్యో॥

  • యేయవాన్నాయనయదా, గోనూమ్నాస్తధైవచ, తాన్ దేకాన్ సంశ్రయిష్యంత యుగాంతే పర్యుసస్థితే॥నిన॥