పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

నువు వచించియున్నాడు. మాంసము తినవచ్చునా తినగూడదా యను ప్రశ్న క్షాత్రయుగాంతప్రాంతమున జనులమనస్సున్ చాల కలవరపఱపరచినట్లున్నది. ఇట్టి తర్కవితర్కములకు ముఖ్యకారణ ము అప్పుడు ప్రచారమునందుండిన అహింసాసిద్దాంతమే. అనుశాసన పర్వములోని 115 వ అధ్యాయమునందు యుధిష్టిరుడు ఇట్లు భీష్మునడిగెను. "అహింస పరమధర్మమని మీరు చెప్పుచున్నారు. శ్రాద్దసమయమున పితృదేవతలకు మాంస మర్పింపవలయునని మీరే చెప్పుచున్నారు. హింసలేకుండ మాంస మెట్లు వచ్చును? మాంసాహారమువలన కలుగు పాపమేది? దానిని వర్జించిన వారి కబ్బు పుణ్యమెట్టిది? జంతువును వధించి దాని మాంసమును దినిన వారి కెంతదోషము? ఇతరులు చంపితెస్సిన మాంసమును తినిన వారి దోషమెట్టిది?" ఈప్రశ్నములకు భీష్ముని యుత్తరముల జూడుడు. "తేజమును, ఆయువును, బుద్ధిని, బలమును, మేధాశక్తిని కాంక్షించువాడు హింసమానవలెను. మద్య మాంసములను వదిలినవాడు ప్రతిమాసమున నశ్వమేధము చేసిన వానికి లభించు పుణ్యము పొందును. ఇతరప్రాణుల మాంసము చేత శరీరమును పెంచుకొనువాడు తప్పకదు:ఖమును బొందునని నారదుడు వచించియున్నాడు. తనను ఎవరైన హింసించినపుడు ఎట్టి బాధ కలుగుచున్నదో అట్టి బాధయే జంతువులను హింసించు నపుడు వానికిని కలుగుచున్నదని తలంచవలెను. మాంసము కొరకే జంతువులు హింసింపబదుచున్నవి. హింసార్ధము ధనమిచ్చు వాడును, ఒకడు చంఫి తెచ్చినమాంసమును తినువాడును, జంతువులను స్వయముగా చంపువాడును హింసా దొషమున