పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వారి యాహారము.

సమానులు అయినను, ప్రాపంచికులకొఱకు మహర్షు లీవిధమున విధించియున్నారు. కాని మోక్షాసక్తుడగువాడు ఈ నియమము లను పాటింపవలసిన పనిలేదు. దేవతల కర్పింపబడినదియ్యూ పితరులకియ్యబడినదియు తప్ప తక్కిన మాంసం లన్నియు వర్జీయములే. మాంసము తినవచ్చునని వచించిన వసురాజు స్వర్గమునుండి యధోలోకమునంబడి యటనుండి పాతాళము పాలయ్యెను. అగస్త్యుడు జనులపైన దయదలచి వేటజంతువు ప్రోక్షితములని వచించెను. కనుక శ్రాద్ధములలో మాంసము నర్పింప వచ్చును. ముఖ్యముగా అశ్విజమాస శుక్లపక్షమున మద్యమాంస ములను ముట్టగూడదు. చాతుర్మాసములయందు వీనిని వర్జించిన వాడు, యశము, దీర్ఘాయువు, బలము, విజయము, అను వానిని పొందును. ఆశ్వీజమాసమున మాంసమును త్యజించుట వలనెనే నాభాగుడును, అంబరీషుడును స్వర్గము నకు బొయిరి. మద్యమాంసములను త్యజించినవారు మునులవలనబడు చున్నారు."

   పైవాక్యములవలన, మనకు అక్కాలపు జనులకు మాంసాహారముపై గలిగిన అసహనభావమును పూర్వాచారమును త్రోసిపుచ్చజాలక కొన్ని సమయములందు అట్టి యాహారమును వారు వాడుట కొప్పుకొనుటయును తెలియవచ్చుచున్నది. వారు జంతువులబలిని, వేటను తప్పుగా దలపలేదు. వారు తినుచుండిన మాంసము దేవతల కర్పింపబడినట్టిదో వేటాడిన జంతువులదో యైయుండెను. రోమను కాధలిక్కులలోని "లెంటు" వలెనే అప్పటి క్షత్రియులుకూడ జానాబిప్రాయానుసారము ఒక మాసమువఱకుఇ మాంసమును వదలు చుండిరి.