పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రాయుగమునాటి హింద్వార్యులు.

చుందురు" అని 'పరియాను ' వ్రాసియున్నాడు. దీనినిబట్టి చూడ, ఇప్పటివలెనే ఆకాలములగూడ హిమాలయప్రాంతవాసులు మాంసమును దినుచుండిరనియు మైదానములలో నుండువారు శాకాహారులుగా నుండిరనియు తెలియుచున్నది. 'వేటాడిన జంతువులు ' అనుతవలన గోవధ నిషిద్ధమైనట్టు కొంగగొచర మగుచున్నది. కాని పరదేశీయులదృష్టి నాకర్షింపవలసిన యీ యంశము గ్రీకులకేల స్పష్టముగా స్ఫురింపలేదో తెలియరాకున్నది. వారు వ్రాసిననేమి వ్రాయకపోయిననేమి? నేడెట్లో క్షాత్రల్యుగాంతము న గూడ నట్లే గోవధ మహాపాతకముగా నెంచబడుచుండెననుట నిస్సంశయము.

   మహాభారతము నచ్చటచ్చట కానవచ్చుట కానవచ్చు నస్పష్ట చిహ్నములను బట్టి గొవధానిషేధచరిత్రమును కొంచెము కనుగొందము; నహుష సప్తర్షులకధలో, సప్తర్షులు యాగములందు గోవధ క్రమమైనదేయని వాదించుచుండ, నహుషుడది యక్రమమని వాదించును. అనగా సప్తర్షులు క్షాత్రయుగమునాటి పూర్వాచారపరాయణుల భావముల వ్యక్తీకరించినారు; నహుషుడు సంస్కార వాదుల యభిప్రాయములను ప్రకటించియున్నాడు. "గోవులను బలియియ్యవచ్చునని చెప్పు వేదమంత్రములను నీవు నమ్ముదువా?" యని నహుషుని అగస్త్యుడడిగెను. *"నేను నమ్మ" నని నహుషుడు ఉత్తరమిచ్చెను. ఋషునిట్ల

  • యఇమేబ్రహణాస్రోక్తా, మంత్రానైప్రోక్షణేగవాం ఏతేప్రమాణంభవేఈ, ఉతాహో నేతివాసనకి నహుషోనెతితానాహ తమసోమా ఢచేతన: ఋ.ఉ.ఆధర్మేసంప్రబృత్తస్త్వం ధర్మం ప్రతిబుధ్యనే ప్రమాణేతదసాకం, పూర్వపోక మహర్షిభి॥ ఉద్యో॥