పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

యిచ్చుచుండిన వృషభముల *చర్మముల కుప్పలలోనుండి యొక నది యుత్పత్తియయ్యెననియు, దానికి చర్మావతీ (చేంబలు) యను సార్ధకనామము వచ్చననియు, మహాభారతముననున్నది. ఇక గోడ్డు మాంసమును దినుచుండిరను విషయమున, కావలసినచో భచ్వభూతి కృతమగు 'ఉత్తరరామచరిత్ర 'లోని వశిష్టవిశ్వామిత్రుల శిష్యుల సంభాషణము చూడదగును. ఈ సంభాషణమున వశిష్టుని యాతిధ్యమునకై మధుపర్కముకొరకు చిన్నయావ్చు నొకదానిని వధించిన విధమును తెల్లగడ్డముగల యాజడదారియెదుట నాయావు, పుళ్ ముందుబడిన మేకపిల్లవలె, గుటక్కున మాయమైన విధమును వర్ణింపబది యున్నది. స్థితిగతులట్లుండగా క్షాత్రయుగాంతమునాటికి గోవృషభములు ఆహారరూపపున మనవారి కుక్షులలోబడకుండ నెట్లుతప్పించుకొనగల్గెనో తెలియవచ్చుటలేదు. ఎట్లయిననేమి! క్షాత్రయుగాంతమునాటికి వానికాయవస్థ తప్పినది. ఎందుచేతనోకాని గ్రీకులు ఈ నిషేధము వ్రాయలేదు. అప్పటికాలపువారు శాకాహారులుగా నుండిరనియు, జంతువుల బలియిచ్చుట వారేవగించుకొనుచుండిరనియు, గ్రీకుకులు కనిపెట్టిరి. "హిందూదేశీయులు సాధారణముగా ధాన్యము తిని జీవించెదరు; నేలదున్నెదరు. కాని పర్వతప్రాంతములవారు మాత్రము వేటాడిన జంతువుల మాంసము దిను


  • రంతిదేవునియింట దినమునకు 1000 పశువులు చంపబడుచుండెనని చెప్పబడియున్నది:--

ఆలభంతతదాగాన॥, సహస్రాణ్యేకవింశతి: । తత్రస్మమాదాక్రోశన్తి, సుమృష్ట మణికుండలా॥ । సూపంభూయిష్టమశ్నీధ్వం, నాద్యమాం సంయధాపురా॥ ద్రోణ॥