పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి యాహారము.

నిరి. "నీవధర్మమార్గమున నున్నావు. అనుశ్రుతముగా వచ్చుచు న్న మతము నీవొప్పుకొనకున్నావు" తరువాతజరిగిన వాదవివా దమున నహుషుడు అగస్త్యుని తలమీదగొట్టి, శాసనశమున మతక్యాలోకమున సర్పమై జన్మించెను. నకులము కధలో జంతు హింసకు ప్రతికూలముగా నున్న అగస్త్యుడు ఈ సందర్భమున జంతు హింసకు అనుకూలుడుగా నుండుట విచిత్రముగానున్నది. పైన వివరింపబదిన శ్లోక వ్యాఖ్యానమున గొవుయొక్క సానిత్య్రము ఏర్పడినకారణము చూపబడియున్నది. యాగసంబంధములగు మంత్రములకు బ్రాహ్మణుడెట్లు ఉనికివట్లోయట్లే యజ్ఞ ద్రవ్యములగు క్షీరము, నేయి మొదలగు వానికి ఆవులునికిపట్టులు కనుక ఆవులను వధింపగూడదని నహుషుడుతలచెనట. గోవధానిషేధము నకు మరియొక కారణము గూడనుండవచ్చును. కృష్ణునకు గోవుల గౌరవముకూడ హెచ్చియుండవచ్చును. ఇంకొక సంగతికూడ గమనింపదగియున్నది. ఇరానియనులు గోవులపావిత్ర్యమును అమ్ముచుండిరి. కనుజ్క సింధునది యావలినుండి అప్పుడప్పుడు వచ్చుచుండిన యార్యులతోగూడ నీయభిప్రాయము దేశమునందంతట బ్రవేశించియుండవచ్చును. ఎట్లువచ్చిన నేమి? గోవజ్ధానిషేధముక్షాత్రయుగములోనే వచ్చినదనియు అది కొంతకాలమువఱకు వాదవివాదములకు గుఱియై ఆయుగాంతము వఱకు స్థిరపడినదనియు మనము నమ్మవలెను.

    వీపులమీద బరువులనుమోసికొనిపోల్వు జంతులమాంసము తినకూడదని మనదేశమందొక నియముండేను. మహా