పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వారి భూగోళశాస్త్రజ్ఞానము.

తద్యుగాంతమునాటివఱకును కొంతస్పష్టముగనైన నేమి కొంత యస్పష్టముగనైననేమి, మనవారుఈదేశము నామూలాగ్రమెఱి గియుండిరి. వేదమునందు సముద్రముమాటవచ్చియున్నది. సింధు నదీప్రవాహమువెనువెంట నౌకలలోబోయి యుండిననేకాని వారికి సముద్రపు సంగతి తెలిసియుండదు. వేదమునందు పంజాబు నందలి నదుల పేళ్ళను, గంగాయమునల పేళ్ళును, (వీనియుత్పత్తి స్థానములకు సమీపమున వారీనదులనెఱిగియుండిరి.) వచ్చి యున్నవి. రామునికాలమున మనవారు తూర్పుసముద్రమను, గోదావరినదిని, కొంతయస్పస్టముగానైను లంకాద్వీపమును, తెలిసి యుండిరి. శ్రీకృష్ణునికాలమున ఉత్తరహీందూస్థానము నామూలాగ్రముగను,దక్షిణహిందూస్థానములోని చాలభాగమును మనమునఱిగియుండిరి. ఇంతయేల? మహాభారతము తుదిమారు నిర్మింపబడుటకుముందే, అలెగ్జాండరుని దాడికిముందే, మనవారికి హిందూదేశము బాగుగా దెలిసియుండుననుటకు సందియపడ వలసిన పనిలేదు.

  అయినను పాశ్చాత్య విద్వాంసులు ఈవిషయమున తప్పుగా నభీప్రాయపడి యున్నారు. వారి వ్రాతలనుబట్టి చూచినచో, బుద్దుని కాలమున మనవారికి దక్షిణదేశము తెలియనేతెలియదు. చంద్రగుప్త కాలప్రాంతమున మనవారు లంకాద్వీపమున నివసింపబొయిరట! బుద్దుని నిర్యాణ సంవత్సరమున లంకాద్వీప మున మొట్టమొదట ఆర్యజనావాసమేర్పడెనను నభిప్రాయము తప్పనియు, నికాయములు వ్రాయబడుటకుముందు ఆర్యులు సింహళమునకువచ్చుట సంభవించి యుండదనియు, రైసు