పుట:Kshaatrakaalapuhindvaaryulu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్షాత్రయుగమునాటి హింద్వార్యులు.

రాజదానియందును, పారసీక సేవలయందును జయింపబడినమన వారిలోననేకులుండియుందురు. కనుక మనవారు గ్రీకులను, సిధియనులను లెగ్జాండరుని రాకకెన్నియోశతాబ్దములకు పూర్వము ఎఱిగినవారైయుండవలెను. హీరోదోటసు, అనుచరిత్ర కారుడు డెరనయను, పాలనముక్రిందనున్న సాత్రపీలను వణికించుచు ఇరువదవ పాత్రసీయగుమనదేశనునదేశము (హిందూ దేశము) విశేషజనసంఖ్యకలదనియు, దీనికి తూర్పుసరిహద్దున నొకయెడారియున్నదనియు చెప్పియున్నాడు. హీరోడోటసు పై చరిత్ర గ్రంధమును క్రీ.పూ.450 సంవత్సరప్రాంతమున వ్రాసినాడు. కనుక ఆకాలమునవారిని గ్రీకులెఱిగియుండిరనుటస్పష్టము, అంతే కాదు. అస్సీరియనులు (Assyrians) తోడను చాల్డియనుల (Chaldeans) తోడను హింద్వార్యులకు అంతకుపూర్వమే సత్వ సంబంధములుండేను. కనుక మాయభీప్రాయమున; మనవారు యవను లనబడు అయోనియనులను గుఱించి క్రీ.పూ 450 సంవత్సరం కంటే పూర్వమే చెప్పుకొనగా విని యుండవచ్చును. పరిచయము మాత్రము "డెరయను" కాలమునుండి కలిగియుండవచ్చును. మహాభరతమునందలి యొక *శ్లోకమునం దున్నట్లు, అలెగ్జాండరుదండయాత్ర యైనతరువాత వారితో మనవారికి మఱింత సమీపసంబంధ మేర్పడియుండవలెను. యవనులనుగూర్చి చెప్పిన యీమాటయే పారసీకులు, సిధియనులు మున్నగు ఉత్తరదేశ వాసులకు గూడవర్తించు చున్నది.

 ఇమ హిందూదేశమునకువత్తము. క్షాత్రయుగరంభమునుండి

  • సర్వజ్ఞాయవజారజను, శూరశ్త్చినంశేషిత: ॥ కర్ణపర్వముజ్.