పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాయన యాండర్సనుహాలు వాకిలి దాటి లోపల అడుగుపెట్టి, (My Boys) మై బాయిస్ అని యొక కేకవేయుటతోడనే అల్లరి యంతయు చల్లారెను. ఆయన కోపోద్దీపితమైన ముఖమును జూచి అందరును భయమునొందిరి. (shame, my boys, shame)సిగ్గు, పిల్లలారా సిగ్గు అని నుడివి, శాంతించి నేడు మీ పాఠమేమి యని ప్రశ్నించగా గ్రీకులచరిత్రలో పిలపోనీషియన్ యుద్దము అని చెప్పగా విని ఆయుద్ధమునకు కారణములను విపులముగ విశదీకరించి ఆయుద్ధమున గ్రీకుసేన లెట్లుపోరాడెనో తెలుపుచు యుద్ధప్రచారమును వర్ణించి అనన్యమగు వారి వాగమృతమును వర్షించుటయేగాక ఆ చరిత్రాంశముల పరిజ్ఞానమును ప్రకటించిరి. తలవనితలంపుగ క్లాసుకు వచ్చి, ఏప్రయత్నమును లేకయే పిలపోనిషియన్ యుద్ధమునుగూర్చి ఇన్ని వివరములు ఇంత విపులముగ తెలుపుట మాకు మిక్కిలి ఆశ్చర్యమును కల్పించెను. వా రెప్పుడును కళాశాలలో షేక్సుపియరుపాఠముతప్ప మరియొకటి చెప్పెడి వాడుక లేదు. చరిత్రవిషయములో ఆయన కే జోక్యమును లేదు. వారు చెప్పిన దంతయు పూర్వ మెప్పుడో చదివినదైనను అంత బాగుగా చెప్పుట వారికిగల అసాధారణమగు జ్ఞాపకశక్తిని ప్రకటించెను. అట్టి జ్ఞాపకశక్తిచేతనే తన విద్యాశాలలో చదువు సుమారు రెండువేలమంది విద్యార్థులలో ప్రతివానిని పేరుపెట్టి పిలువనేర్చిరి.


____________