పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లిచి చేతిలోపెట్టినట్లుండుటచే మిక్కిలిసంతోషముతో విని, వీరే మాకు బోధకులుగా నుండిన ఎంత బాగుండెడిదో గదా యని అనుకొంటిమి. ఉత్తరాది తెలుగువిద్యార్థులయందు వీరికభిమానము మెండు.

మా కళాశాలాభవనమును పెంపుచేయవలెనను సంకల్పముతో మార్చి, కట్టుచుండగా, ఆకస్మికముగ నొకనాడు గొప్ప తుఫాను వీచుటచే క్రొత్తగాకట్టుచున్న టవరు కూలి హాలుమీద బడి క్రిందిగదులనుగూడ నష్టపరచెను. వర్షము వరుసగ కొన్నిరోజులు మిక్కుటముగ కురియుచుండెను. సమీపమున నున్న యాండర్సన్ హాలులోనికి మాక్లాసు మార్చబడెను. చరిత్రపాఠము చెప్పు ఉపాధ్యాయుడు ఒకనాడు కళాశాలకు రాలేదు. విద్యార్థులు ఆనాడు చేసినఅల్లరి మిన్నుముట్టిపోవుచుండెను. మా ప్రిన్సిపాల్ డాక్టరు మిల్లరుగారు క్రొత్తకట్టడములు పడిపోవుటచే కలిగిన నష్టమునకు మిక్కిలిచింతాక్రాంతులై కళాశాలాభవనమందున్న సమయమున మాక్లాసులో విద్యార్థులుచేయు అల్లరి వారికి మిక్కిలి దుస్సహముగతోచి కోపోద్దీపితులై వర్షములో తడియుచు యాండర్సన్‌హాలులోనికి వచ్చిరి. మిల్లరు దొరగారు పొడవును పొట్టియునుగాని నడితరముఎత్తుగలిగి లావునుగాక సన్నమునుగాక తగినంత దృడకాయముకలిగి గుండ్రని ముఖమున, ముచ్చటగొలుపుమీసములతో శోభిల్లుచుండెను. ఆయన కనుబొమలపై వెండ్రుకలు ఇంచుక దట్టముగ పొడవు పెరిగి కోపమువచ్చినపుడు ముడిబడుచుండెను. గంభీరమగు వారి ముఖారవిందము చూచినంతనే గౌరవముకలుగుచుండును. ఆ నా