పుట:Kavijeevithamulu.pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి సూరనార్యుఁడు.

677

"సీ. చిత్రగుప్తునికైనఁ జింతింప నరు దైన, గణితవిద్యాప్రౌఢి ఘనతకెక్కె
      నవసరంబులయందు నవ్యకావ్యంబులు, కవిజనములు మెచ్చఁగా నొనర్చె
      నాణిముత్తెముల సోయగము మించిన వ్రాలు, వరుసతో నిరుగేల వ్రాయనేర్చె
      నాత్మీయలిపి యట్టు లన్యదేశంబుల, లిపులను జదువంగ నిపుణుఁ డయ్యె
      దేవరాయ మహారాయ ధీవిధేయ, మంత్రివల్లభ చామనామాత్యదత్త
      చామరచ్ఛత్రశిబికాదిసకలభాగ్య, చిహ్నముల నొప్పె జన్నయసిద్ధమంత్రి."

దీనిలో వివరింపఁబడిన దేవరాయని మంత్రి యగుచామనామాత్యుని వివరము మనకింకను దెలియలేదు. అతనివలన నీసిద్ధయమంత్రి ఛత్రచామరాందోళికాదిచిహ్నము లంది ధరియించె నని యున్నది. ఈ సిద్ధయతండ్రియు దేవరాజుకాలీనుఁడే అనియు సిద్ధన యతనిమంత్రికాలీనుఁ డనియు నుండుటచేత జక్కన వృద్ధావస్థలో దేవరాయనిమంత్రిగా నుండెననియు, నీసిద్ధన దేవరాయని వృద్ధావస్థలో నుండెననియు నూహింపవచ్చును. ఈసిద్ధమంత్రింగూర్చి షష్ఠ్యంతములలోఁ గొంత వివరింపఁబడినది. ఎట్లన్నను :_

1. "క. శ్రీమద్వల్లయవరసుత, చామనదండాధినాథసామ్రాజ్యరమా
        సామగ్రీసంపాదక, సామాధిక చతురుపాయసంపన్ను నకున్.

2. క. సముచితయజనాదివిధి, క్రమనిపుణున కుభయవంశఘనకీర్తిసము
       ద్యమనియమాచారునకును, విమలాపస్తంబసూత్ర విఖ్యాతునకున్.

3. ఉ. వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
        పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
        గొన్న కవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రిగా
        సన్నుతిఁ గన్నఁ గన్న సిద్ధనకు సంతతదానకళావినోదికిన్."

మొదటిపద్యములో వల్లయ్యయను వల్లభయ్యకుమారుఁ డగు చామన యనుదండనాయకునివలన సామ్రాజ్యలక్ష్మీసామగ్రి యన గా ఛత్రమరాందోళికాది రాజచిహ్నములను సిద్ధమంత్రి సంపాదించె ననియు, రెండవపద్యములోనీ సిద్ధమంత్రి యజ్ఞాదివిధులలో నిపుణుఁ డనియు, యమనియమయుతుఁ డనియు నాపస్తంబసూత్రుఁ డనియు, మూఁడవపద్యములో వెన్నెలకంటి సూర్యనాముఁ డగుభాస్కరుఁ డనుమహాకవిని యీసిద్ధమంత్రి పెద్దతండ్రిగాఁ గలవాఁడనియు దేలినది. ఈభా