పుట:Kavijeevithamulu.pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

678

కవి జీవితములు.

స్కరుఁడే రెడ్డివేమనవలన ననేకాగ్రహారములఁ గొనియె. ఈవేమనయే హరివంశకృతిపతి. ఇఁక నాశ్వాసాంతపద్యములలో నున్నయీసిద్ధమంత్రివిశేషము లరయఁగా నితఁడు బెల్లముకొండ భైరవునికృపచేత సామ్రాజ్యలక్ష్మిం గైకొనియె నని యున్నది. ఎట్లన-

"శా. శ్రీ మద్బెల్లముకోండ భైరవకృపాశ్రీనిత్యసామ్రాజ్యల
      క్ష్మీమాధుర్యగృహాంతరాంతర - - - -" రెండవయాశ్వసాంతము.

మూఁడవయాశ్వాసముచివరను కర్ణాటరాజును సేవించువాఁ డని యున్నది. ఎట్లన :_

"కా. శ్రీ కర్ణాట మహామహేశ్వర సదా సేవా ప్రధానోత్తమా."

ఇతనికాలము శా. స. 1268 శా. స. 1300 వఱకు.

22.

జక్కనకవి.

ఈకవి నియోగిశాఖాబ్రాహ్మణుఁడు. ఇతనితాతపేరు పెద్దన. తండ్రిపే రన్న యామాత్యుఁడు. ఇతనిచారిత్రము నుడువుటకుఁ బూర్వ మితని యాశ్వాసాంతగద్యమును వివరించెదను. ఎట్లన్నను :_

"ఇది శ్రీమదఖిలకవిమిత్ర పెద్దయయన్నయామాత్యపుత్త్ర శారదాదయావిధేయ జక్కయనామధేయప్రణీతం భైనవిక్రమార్క చరిత్రం బనుమహాకావ్యంబునందు సర్వంబు నష్టమాశ్వాసము."

ఆంధ్రకవినుతి.

ఇతఁడు భారతకవిత్రయమును వినుతించె. ఈకవి యెఱ్ఱాప్రెగడకుఁ దరువాతివాఁడుగాఁ గాన్పించు. ముందుగా నీతని కవిత్రయవర్ణనముం దెల్పి అనంతర మితనికాలము నిర్ణయించుటకు యత్నించెదను. ఎట్లన్నను :_

నన్నయభట్టువర్ణనము.

"ఉ. వేయివిధఁబులంచుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్
      పాయక చెప్పి రిట్టు రసబంధురవాగ్విభవాభిరామధౌ