పుట:Kavijeevithamulu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

కవి జీవితములు

వైష్ణవమతప్రవిష్టులుగా నున్నవారికి గోలకొండవేపారు లనియు నామము గలదు. కావున మఱియొకవేపారీ స్త్రీనిగూడ వర్ణించెను.

9. కర్ణాటాంగన. ఋక్శాఖాబ్రాహ్మణులలో వైదికవృత్తి నుండువారికిఁ గర్ణాటకు లనియు, కరణకమ్మలు (కనడాకమ్మీవా రని యర్థము) అనియు వ్యవహారము గలదు. అట్టివారింగూర్చి యిందుఁ జెప్పెను.

10. కాసలనాటి స్త్రీ. ఆంధ్రదేశములోని వైదికశాఖాబ్రాహ్మణులు వెలనాటివారు, వేఁగినాటివారు, కాసలనాటివారు, తెలగాణ్యులు మొదలగు నామములతో నొప్పియున్నారు. కాని వారిలో శ్రీనాథునిచే నొక్క కాసలనాటివారుమాత్రమే చెప్పంబడుటచేత నాకాలమునకుఁ దక్కినశాఖలబ్రాహ్మణు లీదేశమునకు వచ్చియుండకపోవచ్చును. ద్రావిడు లనుదక్షిణాత్యశాఖయు వర్ణింపఁబడియె.

11. వైష్ణవస్త్రీ. రామానుజమతస్థు లగుబ్రాహ్మణశాఖవారికి వైష్ణవు లని యాంధ్రదేశములో వ్యవహార మున్నట్లీవఱకే చెప్పియుంటిమి. ఇందులో నట్టిశాఖలోని స్త్రీని వర్ణించెను.

12. నంబి స్త్రీ. పైరామానుజమతస్థులలోనే "పాంచరాత్రము వైఖానసము" అనురెండుశాఖ లున్నవి. అందు వైఖాసనశాఖనుబట్టి విష్ణ్వాలయములలో నర్చనాదికములఁ జేయుశాఖవారిని నంబులని వ్యవహరించెదరు. ఆనంబుల స్త్రీ యిందు వర్ణింపఁబడియె.

13. పూజారి స్త్రీ. స్మార్తులలో శివాలయములలో నర్చాదికము జరుపుటకు వెలనాటిపూజారు లనియును, తంబళు లనియు రెండుశాఖలబ్రాహ్మణు లున్నారు. ఈపద్యములో వర్ణింపఁబడినస్త్రీ లాయిర్వురని యెంచవలయును.

14. అగసాలి స్త్రీ. ఆంధ్రదేశములోఁ బంచాణ్ణమువా రనుపేరుతో నొప్పునైదుశాఖలవిశ్వకర్మకులస్థు లున్నారు. వారిలో బంగారు